Duvvada family : మరో మలుపు తిరిగిన దువ్వాడ ఫ్యామిలీ డ్రామా.. శ్రీనివాస్ కొత్త ఇంటిపై వాణి, మాధురి పంతం..
Duvvada family : దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ పరిష్కరించేందుకు ఇరు వైపులా పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ పరిష్కారం అవుతున్న వేళ దువ్వాడ శ్రీనివాస్ ఒక్క ప్రాపర్టీ విషయంలో పట్టు పడుతున్నారు. దువ్వాడ పట్టుబడుతున్న ఆస్తిలో తన వాటా ఉందని మాధురి మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేసింది.
నాలుగు డిమాండ్లకు ఓకే..: వాణి
శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి వర్సెస్ దివ్వెల మాధురి మధ్య జరుగుతున్న సమరంలో సమస్య పరిష్కారం కోసం కోసం చర్చలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాణి శ్రీనివాస్ ఎదుట ఐదు డిమాండ్లను పెట్టగా, నాలుగింటికి ఆయన ఒకే చెప్పాడు. కానీ ఆ ఒక్క ఇంటి విషయంలో మాత్రం ఆయన ససేమీరా అంటున్నాడు.
ప్రస్తుతం టెక్కలిలో శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటిని ఆయన తదనంతరం దాఖలు చెందాలని వీలునామా రాసివ్వాలని వాణి చేస్తున్న డిమాండ్ కు ఆయన ఒప్పుకోవడం లేదు. తనకంటూ మిగిలిన ఒక్క ఆస్తిపై వీలునామా రాయలేనని దువ్వాడ అంటున్నారు.
దీని వెనుక మాధురి ఉందా?
శ్రీనివాస్ ఈ ఇంటి విషయంలో నో చెప్పేందుకు బలమైన కారణమే ఉందట. ఈ ఇంటి నిర్మాణానికి తాను డబ్బు ఇచ్చానని, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని దివ్వెల మాధురి అంటున్నారు. ఆ ఇంటిపై తనకే హక్కు ఉందని పేర్కొన్నారు. ఇల్లు కావాలంటే తగిన ఆధారాలతో రావాలని వాణికి సవాల్ విసిరారు. ఆ ఇంటి విషయంలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
మాధురి పంతం నెగ్గేనా? వాణి పంతం నెగ్గేనా?
శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న కొత్త ఇంటి విషయంలో వాణి డిమాండ్ కు నో చెప్తున్నారు. ఆ ఇంటిని తనదిగా మాధురి భావిస్తున్న క్రమంలోనే ఆయన నో అంటున్నట్టు తాజాగా జరుగుతున్న ఎపీసోడ్ తో అర్ధం అవుతుంది. వాణి ఈ ఇంటి విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెప్తుంది. దువ్వాడ కూడా వెనక్కు తగ్గకపోవడంతో వీరి చర్చలకు బ్రేక్ పడింది. ఈ కుటుంబ పంచాయితీలో మాధురి పంతం నెగ్గుతుందా..? లేక వాణి పంతం నెగ్గుతుందా..? మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.