Samantha : సమంతకు అక్కినేని ఫ్యామిలీ రిలీఫ్ ఇచ్చినట్లేనా?

Samantha

Samantha

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు రిలీఫ్ దొరికినట్లేనా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. తన ప్రతిభతో సినిమాల్లో దొక్కుకున్నది.తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నది. యంగ్ జనరేషన్ లోని టాప్ హీరోలందరితో దాదాపు సినిమాలు చేసింది. తమ సినిమాలో సమంతను తీసుకోవాలని హీరోలు కూడా పట్టుబట్టిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. అటు తమిళంలో కూడా తళపతి విజయ్, సూర్య, కార్తి లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా  చేసింది. బేబీ లాంటి ఫీమేల్ లీడ్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.

ఇక నాగ చైతన్యతో ప్రేమ వ్యవహారం,  పెళ్లి, విడాకులు సమంతపై తీవ్ర ప్రభావం చూపాయి. చైతూతో పెళ్లి తర్వాత తెలుగులో పెద్ద సినిమాలు చేయలేపోయింది. దీనికి అక్కినేని కోడలు కావడమే కారణమని అంతా అనుకున్నారు. దీంతో సమంత హిందీలో ఫ్యామిలీ మ్యాన్ హిందీ వెబ్ సిరీస్ చేసింది. అందులో నటిగా మెప్పించినా బోల్డ్ క్యారెక్టర్ కావడంతో అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చైతూతో వివాహం అనంతరం చాలా విమర్శలు ఎదుర్కొ్న్నది.  అదే సమయంలో మయోసైటిస్ వ్యాధికి గురైంది. వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నది.

ప్రస్తుతం నాగ చైతన్యకు ఎంగేజ్ మెంట్ కావడంతో సమంతపై నుంచి అక్కినేని అభిమానుల దృష్టి మళ్లింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ సమంత జోలికి వెళ్లకుండా ఉండిపోతారని అంతా అనుకంటున్నారు. దీంతో చైతూ ఎంగేజ్ మెంట్ తో సమంతకు రిలీఫ్ దొరికినట్లయ్యింది  

సామ్ కెరీర్ ప్రారంభంలో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎలా దుమ్మురేపిందో మళ్లీ అలాగే తిరిగి తన హవాను కొనసాగిస్తారని, సామ్ ను ఆపేవారు ఉండరంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటుందనే చర్చ జరుగుతున్నది.అక్కినేని కుటుంబం సమంతకు అందించిన భారీ రిలీఫ్ అంటూ నెటిజన్లు సమంతకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.  

TAGS