Elon Musk : అమెరికా ఖజానా అంతా మస్క్ చేతిలోకే.. ట్రంప్ భారీ ఆఫర్..

Elon Musk

Elon Musk

Elon Musk : ఆయనో కుభేరుడు. సంపాదనలో ప్రపంచంలోనే టాప్ 5 లిస్ట్ లో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ట్రంప్ జాబ్ ఆఫర్ చేశాడు. ఈ విషయాన్ని విన్న అమెరికన్లతో పాటు టోటల్ వరల్డ్ ఆశ్చర్యానికి గురైంది. ఏంటి ట్రంప్ ఇలా కూడా మాట్లాడుతాడా? అంతూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

సోషల్ మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ‘ఎక్స్’, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మస్క్ ట్రంప్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి జవాబిచ్చిన ట్రంప్ మస్క్ కు జాబ్ ఆఫర్ చేశాడు. రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాతో కలిసి పనిచేయాలని మస్క్ ను కోరారు ట్రంప్. తమ ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే బాధ్యతను మస్క్ తీసుకోవాలని కోరారు.

‘ఎక్స్’తో పాటు మస్క్ కు చెందిన ఇతర కంపెనీల్లో కాస్ట్ కట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉందని, ఖర్చుల నియంత్రణలో మస్క్ నిపుణుడని ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ విషయాలను గుర్తించాను కాబట్టే మస్క్ కు జాబ్ ఆఫర్ చేశానని వివరించారు. టాక్స్ పేయర్ల నుంచి ప్రభుత్వానికి చేరే సొమ్ము జాగ్రత్తగా వాడాలన్నదే తన అభిమతమని, టాక్స్ పేయర్ల కష్టార్జితంను వృథా చేయడం నాకు ఇష్టం ఉండదని ట్రంప్ చెప్పుకొచ్చారు.

తాను ఇచ్చిన జాబ్ ఆఫర్ ను మస్క్ స్వీకరిస్తే అమెరికాకు మరింత గొప్ప ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఏ విధంగా స్పందించలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపై స్పందిస్తూ గతంలోనే ఈ విషయంపై వారిద్దరి మధ్యా చర్చ జరిగిందని పేర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయన ప్రభుత్వంలో మస్క్ ఎలాంటి పాత్ర పోషించాలో అనే విషయంపై వారు చర్చించుకున్నట్లు తెలిపింది.

TAGS