Mind blank : ‘బ్లింక్’ చూస్తే మైండ్ బ్లాంకే.. ఆకట్టుకుంటున్న థ్రిల్లర్
Mind blank : ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. డిజిటల్ విప్లవం ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. మూడు నెలల క్రితం కన్నడంలో రిలీజైన ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ప్రయోగాత్మక రూపొందిన ఆ చిత్రం ‘బ్లింక్’
‘దసరా’ సినిమాలో హీరో నానికి ఫ్రెండ్‌గా మెప్పించిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన సినిమా ‘బ్లింక్’. హీరో కళ్లు మూసుకుంటే టైం ట్రావెల్ చేస్తాడనే వినూత్న కథాంశంతో తీసిన చిత్రమిది. మార్చి 8న ఈ సినిమాను కన్నడంలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనూహ్య స్పందన లభించింది. దీంతో దీక్షిత్ శెట్టి ఖాతాలో ఓ హిట్టు పడింది.
ఇప్పటి దాకా రాని కాన్సెప్టుతో వచ్చిన ‘బ్లింక్’ చిత్రంపై నెలకొన్న అంచనాల తో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ నెలకొంది. భారీ మొత్తం ఆఫర్ చేసి అమెజాన్ ప్రైమ్ సంస్థ స్ర్టీమింగ్ రైట్స్ తీసుకుంది. కన్నడ వెర్షన్ మే 15 నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఓటీటీలోనూ ఊహించిన దానికన్నా అదిరిపోయే స్పందన రావడంతో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను తెలుగు వెర్షన్‌ను సిద్ధం చేసింది. గత అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ర్టీమ్ అవుతున్నది. మంచి థ్రిల్లర్ కోరుకునే ప్రేక్షలకు ఇదోక మంచి ఆప్షన్.
దీక్షిత్ శెట్టి నటించిన ‘బ్లింక్’ మూవీని కన్నడంలో జనని పిక్చర్స్ పతాకంపై రవిచంద్ర ఏజే నిర్మించారు. మందారా ఫీమేల్ లీడ్ రోల్ చేసింది. చైత్ర జే ఆచార్, సురేష్ అనగల్లి, కిరణ్ నాయక్, విశాల్ జైవిక్, గోపీకృష్ణ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ ఎస్‌ఎస్ సంగీతం అందించారు.