Chaitu : ఇప్పటి దాకా చైతూ సింపతీ వాడుకున్నాడా?
Chaitu : అక్కినేని వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళకు ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాకు ఒక మంచి అస్ర్తం దొరికినట్లయ్యింది. సోషల్ మీడియా లో ఏ ప్లాట్ ఫాం తెరిచినా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, సమంతకు సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి. పాత సంఘటనలను తవ్వతూ కొత్త వాటికి ముడిపెతున్నారు. ఎటు వెళ్లినా మళ్లి నాగ చైతన్య పెళ్లి విషయం దగ్గరకే వచ్చి ఆగిపోతున్నారు.
కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నా అనే సంతోషం కూడా నాగ చైతన్యకు లేకుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ తో అక్కినేని ఫ్యామిలీ కూడా కొంత అసహనానికి గురవుతున్నాది. డైవర్స్ కు ముందే సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తీసేసింది. దీంతో నెటిజన్లు ఆ సమయంలో సమంతపై విరుచుకుపడ్డారు. కానీ చేసిందంటా చైతూనే అని, తిట్టాల్సిందే అక్కినేని వారసుడినే అని అంటున్నారు. సింపతీ కార్డు వాడుతూ చైతూ రెండేళ్లుగా పక్కాగా ప్లాన్ చేశాడని.. విడాకుల విషయం మరిచిపోవడంతో అంతకు ముందు నుంచే కొనసాగుతున్న రిలేషన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
అంతేకాదు ఇప్పటి దాకా సమంత ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ఖాతా నుంచి తొలగించకుండా అలాగే ఉంచింది కేవలం తనమీద ఎవరికీ అనుమానాలు రావద్దనే ఉద్దేశంతో చైతూ పక్కాగా ప్లాన్ చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు.చైతూ తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకుంటున్నాడని అంటున్నారు .కానీ నెటిజన్లు అసలు విషయం గుర్తించకుండా సమంతను టార్గెట్ చేశారంటూ ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. కాగా దీనిపై మరికొందరు స్పందిస్తున్నారు. ‘ఒక రిలేషన్ లో ఇమడకపోతే ముందుగా అమ్మాయిలనే బ్లేమ్ చేస్తారు.. ఇకనైనా ఎదగండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.