YCP MLC Duvvada : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ రచ్చ
YCP MLC Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విడాకులు తీసుకోకుండా మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్న ఆయన భార్య వాణి రాత్రి శ్రీనివాస్ ఇంటి దగ్గరే నిద్రించింది. శ్రీనివాస్ టెక్కలిలోని కొత్త ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ ఇద్దరు కూతుళ్లు హైందవి, నవీన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా శ్రీనివాస్ తలుపులు వేసుకున్నాడు. దాంతో మరో సారి నిన్న బంధువులతో వెళ్లిన హైందవి తండ్రిని కలవలేకపోయింది. అర్ధరాత్రి వాణి, హైందవి ఆ ఇంటికి వెళ్లి కట్టర్‌తో తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఇంటి బయటే పడుకున్నారు. ప్రస్తుతం అక్కడ పోలీసు పికెట్ ఉంది.
ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిలోనే ఉన్నాడు. తన భార్యే తనకు మొదటి శత్రువు అని శ్రీనివాస్ చెప్పాడు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామని పార్టీ చెప్పడంతో వాణి ఆ టికెట్ తనకే ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. తనను బలిపశువును చేసేందుకు వాణి ఆడుతున్న డ్రామా ఇది అని అంటున్నారు. శ్రీనివాస్ తన ఇంటి గేట్లను గునపాలతో పగులగొట్టినట్లు తెలిపారు. తనను చంపడానికే ఇదంతా జరుగుతోందన్నారు.
ఈ హత్య విషయం వల్లే తాను కొత్త ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు. ఈ హత్య కారణంగా తనకు గన్ లైసెన్స్ కావాలన్నారు. దీని వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు హస్తం ఉందని శ్రీనివాస్ అంటున్నారు. మరోవైపు తన భర్తతోనే ఉంటానని వాణి చెబుతోంది. పిల్లల కోసం తన భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నానని చెప్పింది. నిన్న తనపై వచ్చిన ఆరోపణలను మాధురి ఖండించింది. ఇవన్నీ వాణి ఆడుతున్న డ్రామాలే అన్నారు. ఆమె తన కేర్ టేకర్ అని చెప్పిన శ్రీనివాస్.. తమ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్పాడు.