Heroine Samantha : మాజీ భర్త నిశ్చితార్థం తర్వాత హీరోయిన్ సమంత హార్ట్ బ్రేక్.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్..

Heroine Samantha

Heroine Samantha

Heroine Samantha : సమంత హార్ట్ బ్రేక్ అంటూ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతున్నది. ఆమె మాజీ భర్త, హీరో నాగచైతన్య నిశ్చితార్థం గురువారం జరిగింది. మరో హీరోయిన్ శోభితా ధూళ్లిపాళ్లతో ఆయన నిశ్చితార్థం పూర్తయ్యింది. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఒకటి వైరల్ అవుతున్నది.

అయితే సమంత పెట్టిన పోస్టు మాత్రం నాగచైతన్య గురించి మాత్రం కాదు. అసలు ఈ నిశ్చితార్థానికి సంబంధించి ఆమె ఎలాంటి పోస్టు పెట్టలేదు.  ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై వేటు పడడం గురించి. అయితే త్రుటిలో పతకాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయిన వినేశ్ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించారు.

వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించగానే, సమంత స్పందించారు. తన హార్ట్ బ్రేక్ అయినట్లు ఒక ఎమోజీతో పోస్ట్ చేశారు. రెజ్లింగ్ నుంచి రిటైరవుతున్నట్ల ఆమె అనౌన్స్ చేసిన క్యాప్షన్ తో ఆమె ప్రకటనను పోస్ట్ చేసింది.

రిటైర్మెంట్ సందర్భంగా వినేశ్ చేసిన పోస్టు సమంతను బాధించినట్లు తెలుస్తున్నది. రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయాను అంటూ వినేశ్ పోస్టు భారతీయులందరినీ కదిలించింది. కోట్లాది గుండెలు ఆమెకు అండగా నిలిచాయి. నువ్వు ఓడిపోలేదు.. మా మనసులు గెలుచుకున్నావంటూ పోస్టులతో ధైర్యం నింపారు. ఇక వినేశ్ ఫొగాట్ నిర్ణయంతో తన గుండె పగిలిందంటూ సమంత సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అయితే దీనిని నెటిజన్లు మాత్రం నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం సందర్భంగా చేసిన పోస్టు అంటూ రెండు కలిపి ట్రోల్ చేస్తున్నారు. భారత క్రీడాకారిణికి సమంత అండగా నిలవడం ఆనందంగా ఉందంటూ మరికొందరు రీ పోస్టులు పెడుతున్నారు.

TAGS