RGV : ఆ హీరో.. సొంత డబ్బుతో సినిమా నడిపించిండు .. ఆర్జీవీ
RGV : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఏదైనా ఉంటే ముఖంపైనే చెప్పేస్తాడు. ఏదైనా కుండబద్దలు కొట్టేస్తాడు. ఆయన తాజాగాఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. స్టార్ డైరెక్టర్లు, హీరోల సినిమాలకు జనం లేకున్నా డబ్బులు పెట్టి నడిపిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో అభిమానుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. సినిమా సరిగా లేకున్నా అనేక సార్లు చూస్తారని ఆరోపించారు. ఇటీవల సినిమాలు వంద రోజులు, ఆపైన నడిపించే పద్ధతి పోయి కలెక్షన్లు ఎక్కువ రాబట్టే రోజులు వచ్చిన ఈక్రమంలో ఇలా మాట్లాడడం సంచలనం. ఈ క్రమంలో సినిమా బాగా లేకున్నా ఎక్కువ రోజులు ఆడించే క్రమంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవల బాలివుడ్ కు చెందిన ఓ కంపెనీ తెలుగు హీరోతో సినిమా తీసింది. అది సరిగా నడవకపోవడంతో నష్టాలు వచ్చాయి. కాగా, సదరు కంపెనీ వచ్చి హీరోకు పలు సూచనలు చేసింది. సినిమాను థియేటర్ల నుంచి తీసివేయాలని సూచించింది. నష్టాలతో సినిమా నడిపించలేమని చేతులెత్తేసినట్టు ఆర్జీవీ ఆరోపించారు. అయితే, ఆ కంపెనీ నిర్ణయంతో ఆ హీరో ఏకీభవించాడు, కానీ, హీరో ఫ్యాన్స్ మాత్రం సినిమాను నడిపించాల్సిందేనని గొడవకు దిగారు. సినిమాను తీసేస్తే మీ ఫ్యాన్స్ గా మేము అవమానం భరించలేమని, సినిమాను నడిపించాల్సిందేనని పట్టుబట్టారు.
దాంతో సినిమా హీరో ఆ కంపెనీకి ఫోన్ చేసి సినిమాను తానే కొంతకాలం డబ్బు చెల్లించి నడిపిస్తానని చెప్పాడు. అందుకు ఎంత డబ్బు అయినా భరిస్తానని తేల్చి చెప్పాడు. అయితే ఈవిషయం డిస్ట్రిబ్యూటర్లకు చెప్పడంలో విఫలమయ్యాడు. దాంతో పేపర్లో యాడ్ ఇవ్వడం ఆపేశాడు. సంస్థ డబ్బుల ఇవ్వకపోవడంతో సినిమా నడుస్తున్నప్పటికీ యాడ్స ఇవ్వలేదు. కార్పొరేట్ సంస్థల తీరు ఈ విధంగా ఉంటుందని ఆర్జీవీ ఆరోపించారు. ఇంతకు ఆ హీరో ఎవరనేది సినీ ఇండస్ట్రీలో చర్చకు దారితీసినట్టు సమాచారం.