Allu Arjun : అల్లు అర్జున్ తప్పు చేశాడా..? దీనికి పనశ్చాత్తాప పడడం ఖాయమేనా?

 Allu Arjun

Allu Arjun

Allu Arjun : ఈ ఏడాది ఆగస్టులో పండుగలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సెలవులు కూడా ఎక్కువే. ఆగస్ట్ లో రిలీజైన మూవీస్ కలెక్షన్ బాగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలీవుడ్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పలు రిలీజ్లను ముందుకు తీసుకువస్తూ బ్లాక్ బస్టర్ సీజన్ కు బాలీవుడ్ సిద్ధం అవుతోంది.

ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్ట్ 16న ‘పార్శీ’ నూతన సంవత్సరంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఆగస్టు 17-18 వారాంతం కుటుంబ సభ్యులతో కలిసి సినిమా ఆస్వాదించే మరొక వీలు ఉంటుంది. ఇక, ఆగస్ట్ 19 రక్షా బంధన్, ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమితో సెలవుల పరంపర కొనసాగుతుండడంతో వినోదానికి డిమాండ్ ఏర్పడింది. ఈ వరుస సెలవులు, సాధారణ వారాంతాలతో కలిపి, ఇటీవలి కాలంలో అత్యంత అనుకూలమైన బాక్సాఫీస్ కాలానికి వేదికను ఏర్పాటు చేశాయి.

అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ మొదట ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. మోస్ట్ కన్జర్వేటివ్ ట్రేడ్ అనలిస్టులు కూడా భారీ ఓపెనింగ్స్ ను అంచనా వేసి, తొలి రోజు హిందీలో 60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టవచ్చని కలలు కన్నారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉండడంతో ఈ సినిమా పది రోజుల్లోనే 400 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేశారు. హిందీలో ఓ తెలుగు డబ్బింగ్ సినిమాకు ఊహించని రికార్డులు నెలకొల్పి ఏళ్ల తరబడి అజేయంగా నిలిచిన పుష్ప 2కు ఈ రిలీజ్ డేట్ సరిగ్గా సరిపోయింది.

దురదృష్టవశాత్తు షూటింగ్ ఆలస్యంకావడం ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడడంతో కొత్త తేదీపై సందేహాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 15న విడుదల తేదీ కోల్పోవడం గమనార్హం, ఎందుకంటే ఇది మళ్లీ వచ్చే అవకాశం లేదు. సరైన రిలీజ్ విండోను క్యాష్ చేసుకొని, బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోల్లో ఒకరిగా ఎదగడంలో, అది కూడా రాజమౌళి సపోర్ట్ లేకుండానే ఈ ఛాన్స్ మిస్ అయినందుకు అల్లు అర్జున్ పశ్చాత్తాపం చెందే అవకాశం ఉంది. పూరీ జగన్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ తో పాటు స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద వంటి సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ అవుతున్నాయి.

TAGS