Bra : బ్రా ధరిస్తున్నారా..? అయితే మీరు వీటిని కోల్పోయిన్నారన్న మాట!

Bra

Bra

Bra : మహిళల దుస్తుల్లో ‘బ్రా’ ఒక ముఖ్యమైనది. ఇది మహిళ అందంతో పాటు రొమ్ముల ఆకృతి మెరుగ్గా ఉంచేందుకు దోహదపడుతుంది. మహిళలు బ్రా ధరించడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే, ఇక్కడ ప్రస్తావించేవి ప్రతీ మహిళకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఇది శరీర నిర్మాణం, బ్రా రకం, ధరించే పద్ధతిని బట్టి ఉంటుంది.

బ్రాతో నష్టాలు..
చర్మ సమస్యలు: బ్రా కోసం ఉపయోగించే క్లాత్, సింథటిక్ బట్టలు, చెమటను గ్రహించుకోవు. దీని వల్ల చికాకు కలుగుతుంది. దురద పెట్టడంతో పాటు దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

నొప్పి: సైజును సెలక్ట్ చేసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఫిట్ గా ఉండేది  వేసుకుంటే రొమ్ముల్లో నొప్పి, రక్త ప్రసరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

లింఫాటిక్ సిస్టమ్‌పై ప్రభావం: కొన్ని అధ్యయనాల ప్రకారం.. స్పోర్ట్స్ బ్రాలు, రొమ్ము కణజాలంపై ఒత్తిడి పెంచి లింఫాటిక్ (పాలు ఇచ్చే వ్యవస్థ) సిస్టమ్‌ను ప్రభావితం చేయవచ్చని తేలింది.

శ్వాసలో ఇబ్బంది: చాలా గట్టిగా ఉన్నవి ధరిస్తే ఊపిరి కూడా తీసుకోవడంలో ఇబ్బంది కలుగవచ్చు.

ఆకృతిలో మార్పు: కొందరు నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. దీర్ఘకాలంగా బ్రా ధరించడం వల్ల రొమ్ము ఆకృతిలో మార్పు ఉండక అలాగే నిలిచిపోతుంది అంటున్నారు.

నష్టాలను తగ్గించే చిట్కాలు
రొమ్ములకు సరిగ్గా సరిపోయే సైజును మాత్రమే వాడాలి. కాటన్ లాంటి సహజ ఫ్యాబ్రిక్ లతో తయారైనవే ఎంచుకోవాలి. ఇవి చర్మానికి ఇబ్బంది కలిగించవు. రోజంతా కంటిన్యూగా బ్రా వేసుకోవడం అవసరం లేదు. ఇంట్లో ఉన్న సమయంలో లేకుండా ఉంటేనే మంచిది. వ్యాయామం చేసే సమయంలో స్పోర్ట్స్ బ్రా ధరించాలి. ఇది కొంచెం ఫ్లెక్సీబుల్ గా ఉంటుంది. రెగ్యులర్‌గా బ్రాలను శుభ్రం చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా పెరిగి చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.

ముఖ్యంగా గమనించాల్సినవి..
బ్రా వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అనేక అధ్యయనాలున్నాయి. అయితే, ఈ అధ్యయనాల ఫలితాలు ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటాయి. అందుకే, ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.

TAGS