Olympics : దక్షిణ కొరియాకు క్షమాపణలు: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు

Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ పొరపాటు జరిగింది. దీంతో విశ్వక్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. శుక్రవాం సెన్ నదిపై పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఒక్కో దేశం నదిపై పరేడ్ లో పాల్గొంది.

ఈ క్రమంలో బోట్ లో జెండాను ఊపుతూ దక్షిణ కొరియా క్రీడాకారుల బృందం రాగా.. ఆ దేశాన్ని పరిచయం చేస్తూ డెమోక్రాటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియా అని ప్రకటించారు. అది ఉత్తర కొరియా అధికారిక నామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే దక్షిణ కొరియా. పూరు విషయంలో గందరగోళం ఈ పరిస్థితికి దారితీసింది. తమ పొరపాటును గుర్తించిన నిర్వాహకులు క్షమాపణలు కోరారు. ఈ విషయమై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎక్స్ ఖాతాలో కొరియన్ భాషలో పోస్టు పెట్టింది.

TAGS