Keerthy Suresh : ఆయనతో వివాహానికి కీర్తి సురేష్ ఒప్పుకుందా? రఘు తాతా ప్రమోషన్ లో సంచలన విషయాలు..
Keerthy Suresh : హానటి లాంటి గొప్ప చిత్రం తర్వాత ఆ స్థాయిలో కీర్తి సురేష్ భారీ సినిమా ఏది పడలేదు. నితిన్ తో రంగ్ దే బాక్సాఫీస్ వద్ద బాగానే ఉన్నా.. ఆశించినంత క్రెడిట్ మాత్రం దక్కలేదు. ఉమెన్ ఓరియంటెడ్ మూవీగా మిస్ ఇండియా ట్రై చేసినా మహానటి వరకు చేరుకోలేకపోయింది. సఖి వచ్చినా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రఘు తాతతో ఫ్యాన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతుంది.
కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రఘు తాతా’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో కీర్తి సురేష్ ప్రమోషన్ వర్క్ లో బిజీగా మారారు. ఇందులో భాగంగా తన మింగిల్ అవుతూ సినిమా విశేషాలను పంచుకుంటోంది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం చుట్టూ చక్కర్లు కొడుతున్న పుకార్లపై ఫోకస్ చేస్తూ ఇటీవల ఆమె అభిమానుల నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
తనకంటే దాదాపు 20 ఏళ్లు పెద్దవాడైన దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికితోడు కీర్తికి, ప్రముఖ తమిళ సంగీత దర్శకుడికి వివాహం జరగబోతోందని గాసిప్స్ ఉన్నాయి. ఈ ఊహాగానాలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి ఈ రూమర్స్ పై హుందాగా, తెలివిగా స్పందించింది. ‘మనం స్పష్టం చేస్తే ‘నిజం చేస్తే అబద్ధం అవుతుంది, అలాగే, మేము దాన్ని కన్ఫమ్ చేస్తే ఒక పుకారు నిజం అవుతుంది.’ అని ఆమె నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు.
ఇలాంటి నిరాధారమైన గాసిప్స్ అనవసరమైన దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు వాటిని విస్మరించడానికి తాను ఎంచుకుంటానని ఆమె వివరించారు. ఈ ఇన్ పుట్స్ తన ఎదుగుదలకు సానుకూలంగా దోహదం చేస్తుందని నమ్ముతున్న కీర్తి సురేష్ తన నటన, సినిమా ఎంపికలకు సంబంధించిన నిర్మాణాత్మక విమర్శలపై దృష్టి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.
అయితే, ఆమె తన వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలను ఉదాసీనంగా ఉంచుతుంది. వాటిని తీవ్రంగా పరిగణించడానికి అర్హమైనవి కాదని తోసిపుచ్చింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘రఘు తాతా’ చిత్రం కీర్తి సురేష్ కు ముఖ్యమైన ప్రాజెక్ట్, హోంబలే ఫిలింస్ నిర్మించిన మొదటి తమిళ చిత్రం.