Olympics : ఒలింపిక్స్ లో మొదటి రోజు.. నిరాశపర్చిన భారత షూటర్లు

Olympics

Olympics

Olympics : ఒలింపిక్స్ 2024లో మొదటి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీం విభాగంలో రమిత-అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్-సందీప్ సింగ్ జోడీలు ఫైనల్ కు వెళ్లలేకపోయాయి. క్వాలిఫికేషన్ రౌండ్ లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్ తో ఆరో స్థానంలో నిలిచింది. మరో జోడి వలరివన్-సందీప్ సింగ్ 626.3 పాయింట్లత 12వ స్థానంలోనే నిలిచింది. దీంతో టాప్-4లో ఉన్నవారు ఫైనల్ అర్హత సాధిస్తారు.

ఇక రోయింగ్ మెన్స్ సింగిల్ స్కల్స్ హీట్స్ లో భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. హీట్ 1లో అతడు 7:07.11 నిమిషాల్లో రేసును కంప్లీటు చేశాడు. దీంతో నాలుగో స్థానంలో ఉండటం వల్ల రెపిచేజెస్ రౌండ్ కు చేరుకున్నాడు. అంటే సెమీ ఫైనల్ లేదా ఫైనల్ కు వెళ్లేందుకు అతడికి మరో అవకాశం దక్కింది.

TAGS