Bhatti Vikramarka : తెలంగాణ సీఎంగా ‘భట్టి’.. కాంగ్రెస్ ‘దళిత’ కార్డుతో సంచలనం?

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : టీఆర్ఎస్ గెలిస్తే కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే.. ఇది సాక్షాత్తు కేసీఆర్ అన్నమాట. కానీ రెండు దఫాలుగా పాలించిన కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయలేదు కదా.. కనీసం తన క్యాబినెట్ లో గరిష్టంగా (ఒక్కరు, ఇద్దరు తప్ప) మంత్రి పదవులను కూడా కల్పించలేదు. రెండు సార్లు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో సారి తను మళ్లీ ముఖ్యమంత్రి కావాలిన కోరుకుంటున్నాడు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది. సర్వేలన్నీ ఆ పార్టీకే అనుకూలంగా వస్తున్నాయి. ఓటరు గాలి కూడా అటు వైపునకే వీస్తుందని తెలుస్తోంది. ఏదో పెద్ద అద్భుత్వం జరిగితే తప్ప కాంగ్రెస్ ఓడిపోవడం అసమంజసం అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ రెండు దఫాలుగా గెలిచిన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి మళ్లీ కేసీఆరే అని అందరికీ తెలిసిందే. ఇక, బీజేపీ తన స్టాండ్ ‘బీసీ ముఖ్యమంత్రి’ అని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడే తెలిపారు. ఇక గెలిచే పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం తన ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి చెప్పడం లేదు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అవే కనుక నిజమైతే కేసీఆర్ అన్నమాటను కాంగ్రెస్ నెరవేర్చింది అవుతుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ‘భట్టి విక్రమార్క’ అవుతాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించి మొదటి దళిత ముఖ్యమంత్రిగా భట్టి రికార్డు సృష్టిస్తాడు. అయితే భట్టి విక్రమార్క సోనియాగాంధీ కుటుంబానికి విధేయుడు. పార్టీలో సీనియర్ నేత. రాజశేఖర్ రెడ్డి, భట్టికీ మధ్య మంచి సంబంధం ఉంది. పైగా సౌమ్యుడు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం అతనిది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మనస్సులో ఉంది ఇదే. అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

TAGS