27th November Horoscope : నేటి రాశి ఫలాలు
27th November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. శివనామాన్ని స్మరించడం ఉత్తమం.
వ్రషభ రాశి వారికి అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నైపుణ్యంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టదేవతారాధన చేయడం మేలు.
మిథున రాశి వారికి ఒక వార్త విచారం కలిగిస్తుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు ఎక్కువవుతాయి. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి పనుల్లో మంచి ఫలితాలుంటాయి. అనుకూల కాలం. గ్రహాలు బలంగా ఉన్నాయి. విందు వినోదాల్లో చురుకుగా ఉంటారు. ఇష్టదేవతారాధన శుభాలు కలిగిస్తుంది.
సింహ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రీవారి దర్శనం అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శివనామాన్ని స్మరించడం మంచిది.
తుల రాశి వారికి అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఏకాగ్రతతో ముందుకు వెళతారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. దుర్గాధ్యానం చేయడం లాభాలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి ప్రశాంతంగా ఆలోచిస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. సూర్యుడిని ఆరాధించడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి వారికి పట్టుదలతో ముందుకు వెళతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. లక్ష్మీధ్యానం మంచి ఫలితాలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శివారాధన చేయడం ఉత్తమం.
కుంభ రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే బెటర్. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మీన రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఇష్టదేవతారాధన శుభాలు కలిగిస్తుంది.