Chandrababu : ఆ డాన్ కు, జగన్ తక్కువేం కాదు..చంద్రబాబు పోలిక అదుర్స్

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. అతన్ని కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. అసెంబ్లీలో మాట్లాడిన బాబు వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జగన్ చేస్తున్న నిరసనను సీఎం బాబు వ్యతిరేకించారు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియా డ్రగ్ లార్డ్ అని, అతను నార్కో టెర్రరిస్ట్ అని, రాజకీయ నాయకుడిగా మారి తన కార్టెల్ తో డ్రగ్స్ అమ్ముకున్న డ్రగ్స్ డీలర్ అని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అతను 30 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు వెల్లడించారు. ఆ డ్రగ్స్ అమ్మకం విలువ దాదాపు 90 బిలియన్ డాలర్లు ఉంటుందని బాబు తన ప్రసంగంలో తెలిపారు.

 కొలంబియా దేశంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మత్తు పదార్థాలు తయారుచేసి అమెరికా, రష్యా, చిలీ, పోర్చుగల్, ఇంగ్లాండ్, స్వీడన్, డెన్మార్క్, భారత్, వంటి దేశాలకు  ఓడలు, విమానాల ద్వారా రవాణా చేసేవాడన్నారు. మత్తు పదార్థాల వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన తర్వాత.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో కీలక పదవులు అధిరోహించినప్పటికీ తన మత్తు పదార్థాల తయారీ వ్యాపారాన్నివదులుకోలేదన్నారు.  పైగా ఆ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. తన అక్రమ దందాకు రాజకీయంతో కావడంతో అపరిమితమైన డబ్బును సంపాదించాడు. వ్యవస్థలను మేనేజ్ చేశాడు. పోలీసులను గుప్పిటపట్టాడు. ప్రపంచ దేశాల అధినేతలతో ఆర్థిక సంబంధాలు నడపడం మొదలు పెట్టాడు. ఫలితంగా అతని మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. చివరికి 1993 డిసెంబర్ 2న కొలంబియాలోని మెడలిన్ ప్రాంతంలో మరణించాడు.

 మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నందుకు గాను ఐదేళ్ల  జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఎస్కోబార్ 1976లో మారియా విక్టోరియాను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి సెబాస్టియన్ మారో క్వీన్, మనుయెలా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మత్తు పదార్థాలలో విపరీతమైన ప్రాచుర్యంలో ఉన్న కొకైన్ ను తయారుచేసింది ఎస్కో బార్.  

పాబ్లో ఎస్కోబోర్‌ను 1976లో తొలిసారి అరెస్టు చేశారని, అయితే 1980లో ప్రపంచంలోనే అత్యంత ధనిక డ్రగ్స్ కింగ్‌పిన్‌గా మారారని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ అమ్మడం ద్వారా ఎవరైనా ధనవంతులు కావచ్చని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. టాటా, రిలయన్స్‌, అంబానీల కంటే ధనవంతులు కావడమే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని చంద్రబాబు ఆరోపించారు. కొందరికి అవసరాలు, కొందరికి కోరికలు, కొందరికి పిచ్చి, పిచ్చివాళ్లే ఇలాంటి పనులు చేస్తారని చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు.

TAGS