Bollywood : వన్ మూవీ 20 రీమేక్స్! వ్వా.. వ్వా.. మరోసారి ఆ బాలీవుడ్ స్టార్ హీరో ప్రయోగం.. ఈ సారైనా సత్తా చాటుతాడా?
Bollywood : బాలీవుడ్ స్టార్ హీరో.. హిట్ మెషిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కెరీర్ లో కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఎంతలా అంటే ఆయన సినిమా సైన్ చేస్తే చాలు అది ఖచ్చితంగా డిజాస్టరే అని రాసిచ్చినంతగా. 2016 నుంచి 2019 వరకు అక్షయ్ కుమార్ బాలీవుడ్ ను ఏలాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్ మెషీన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు వరుస హిట్లతో సూపర్ హిట్స్ గా నిలిచాయి.
2019లో ‘కేసరి’, ‘హౌజ్‌ఫుల్ 4’, ‘మిషన్ మంగళ్’, ‘గుడ్ న్యూజ్’ వంటి నాలుగు సూపర్ హిట్ సినిమాలు అందించి రూ. 200 కోట్ల నెట్ బిజినెస్ చేశాడు. మహమ్మారి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా మహమ్మారి అనంతర కాలంలో అక్షయ్ కుమార్ తన 13వ డిజాస్టర్ ను సర్ఫీరాతో అందించాడు. ఆయన ఫ్లాప్ ల జాబితాలో బెల్ బాటమ్, లక్ష్మీ, కత్ పుత్లీ, అత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, బడే మియా ఛోటే మియాన్, ఇప్పుడు లెటెస్ట్ గా సర్ఫిరా ఉన్నాయి.
అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్, అమ్మి విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ ఇటాలియన్ కామెడీ డ్రామా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కు హిందీ రీమేక్, ఆగస్ట్ 15న స్త్రీ 2, వేదాలతో ఈ సినిమా పోటీ పడనుంది. ఇప్పటికే స్పెయిన్, టర్కీ, జర్మనీ, జపాన్, రష్యా సహా 20 దేశాల్లో ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ను రీమేక్ చేశారు. 2018లో కన్నడలో లౌడ్ స్పీకర్ గా రీమేక్ చేశారు. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘12త్ మ్యాన్’ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. ఖేల్ ఖేల్ మే అక్షయ్ కుమార్ కు విజయాన్ని అందించి అతని కెరీర్ ను మరోసారి మలుపుతిప్పుతుందా? లేదంటే మరో డిజాస్టర్ తో ముగుస్తుందా? వేచి చూడాలి.