Kuwait Arrests : 226 మంది ప్రవాసుల అరెస్ట్.. అసలు కువైట్ లో ఏం జరుగుతోంది!

Kuwait Arrests

Kuwait Arrests

Kuwait Arrests : కొంత కాలంగా ఉల్లంఘనదారులపై గల్ఫ్ దేశమైన కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఉపేక్షించడం లేదని తెలుపుతోంది. ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాల్లో అంతర్గత మంత్రిత్వ శాఖ భద్రత అధికారులు, పోలీసులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఉల్లంఘటనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్నారు. ఇదే కోవలో తాజాగా కువైట్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 226 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖైతాన్, షువైఖ్, ముబారకియా, ఇండస్ట్రియల్ సిటీ, ఫహాహీల్ ఏరియాల్లో ప్రభుత్వం చేపట్టిన సోదాల్లో భారీగా ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారే కావడం విశేషం.

ఉల్లంఘన దారులను చట్ట పరమైన చర్యల కోసం అధికారులకు అప్పగించారు. వారు చేసిన నేర తీవ్రతను బట్టి శిక్షలుంటాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ శాఖ అధికారులు మాట్లాడుతూ.. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సెక్యురిటీ క్యాంపెయిన్స్ మెన్ముందు ఇలాగే అన్ని గవర్నరేట్‌ల్లో కొనసాగుతున్నాయని చెప్తున్నారు. పెండింగ్‌లోని కేసులతో పారిపోయిన కార్మికులకు ఆశ్రయం కల్పించవద్దని పౌరులు, నివాసితులను అధికారులు ఆదేశించారు.

ఇది ఇలా ఉంటే.. గడిచిన రెండేళ్ల నుంచి ప్రవాసులపై కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్.. ఉల్లంఘనదారులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబర్‌లోనే 3,837 మందిని దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరిలో 2,272 మంది పురుషులు, 1,565 మంది స్త్రీలు ఉన్నారు. ఎక్కువ మంది పారిపోయిన కార్మికులు కాగా, కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డవారిన వివిధ సెక్టార్లకు చెందిన భద్రత అధికారులు తెలిపారు. ఆగస్టులో 3,848 మందిని కువైట్ దేశం నుంచి బహిష్కరించింది. ఇలా రెండు నెలల్లో కలిపి రికార్డు స్థాయిలో 7,685 మందిని దేశం నుంచి బహిష్కరించింది.

TAGS