America : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ దేశస్థులకు అమెరికా హెచ్చరిక

America

America

America :భారత్ లో పర్యటించే అమెరికా పౌరులకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో పర్యటించవద్దని హెచ్చరించింది. భారత్ లోని మణిపూర్, జమ్మూకశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా పౌరులకు ఆ దేశం సూచించింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. భారత్ లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ అప్రమత్తంా ఉండాలని చెప్పింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతం, లేహ్ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లోనూ పర్యటించ వద్దని కోరింది.

భారత్ అధికారులు తెలిపిన ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు జరిగాయి. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. కాశ్మీరు లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్ మార్క్, పహల్గామ్ లలో చోటుచేసుకుంటాయి. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యాటకులను అనుమతించదు. అని అమెరికా పేర్కొంది.

TAGS