Heavy Rains : ముంబైలో భారీ వర్షాలు.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్
Heavy rains : ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు పలు ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాల కారణంగా ముంబై అతలాకుతలం అవుతోంది. ముంబై నగరం జలమయమైంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.
ప్రస్తుతం ముంబైలోని పలు ప్రాంతాల్లో వరద నీటి ఉధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో రెండు ఉప్పొంగుతున్నాయి. సాయన్, చెంబూర్, అంధేరి ప్రాంతాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. అంధేరి సబ్ వే ద్వారా రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం ఉదయం వరకు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక పుణెలో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు గురువారం ఉదయం డెక్కన్ జింఖాన వద్ద కరెంట్ షాక్ కు బలయ్యారు.