KCR : చివరి నిమిషంలో కేసీఆర్ కొత్త అస్త్రం.. మారబోతున్న తెలంగాణ రాజకీయం..!

KCR

KCR

KCR : తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. మూడు ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు గెలుపు ఓటములపై బేరీజు వేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు బీజేపీ అధినాయకుడు ప్రధాని మోడీ, అటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో మకాం వేశారు. కానీ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం తమ అస్త్రాల ప్రయోగానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నిర్ణయాలు కలిసి వస్తాయా.. హ్యాట్రిక్ విజయం దక్కుతుందా? చూడాలి.

హోరా హోరీ పోరు
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 80 పక్కా అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. విజయం మాత్రం తమకే దక్కుతుందని ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం చెబుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే.. అంశాలపై కేసీఆర్ సమీక్ష చేశారు. ప్రచారం తుది దశకు చేరడంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది? ఏ అంశాలు ఆ పార్టీకి కలసి వస్తాయనే వాటిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చివరి దశలో వ్యూహం మారిస్తే ఎవరూ ఏం చేయరని ఆయన భావిస్తున్నారు. ప్రచారానికి మిగిలిన రెండు రోజుల ప్రచార సభలో కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కేసీఆర్ కొత్త వ్యూహం:
కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సీఎం కేసీఆర్ వైఖరి.. అమలు కాని హామీలు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు.. నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టింది. యువత బీఆర్ఎస్ కు దూరం అవుతుందని ఆ ఓటు బ్యాంకును తమవైపునకు మళ్లించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇదే సమయంలో మహిళల మద్దతు ఎటు వైపు ఉందనేది దానిపై కేసీఆర్ ప్రత్యేక సమాచారం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ సమీక్షించిన కేసీఆర్.. శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రెండు, మూడు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామీణులను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన మారుతుందని భావిస్తున్నారు. ఈ మూడు రోజుల ప్రచారంలో కేసీఆర్ వీటినే ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కీలక ప్రకటనల దిశగా
ప్రత్యేకించి యువతను ఆకట్టుకోవడంతో పాటు మహిళా ఓటు బ్యాంక్.. గ్రామీణ ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోది. కేసీఆర్ చివరి నిమిషంలో చేసే ఈ ప్రకటనల ద్వారా ఏ మేర ఓటర్లపై ప్రభావం ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులకు రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేసింది. ఎన్నికల పోటీ నుంచి ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తోంది. దీంతో, ఇప్పుడు కేసీఆర్ ఏ ప్రకటన చేయబోతున్నారు. ఎలాంటి మార్పు వస్తుందనేది సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది.

TAGS