Minister Uttam Kumar : బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారు: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగానను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో తెలంగాణను పూర్తిగా విస్మరించారన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తగిన వాటాను పొండంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు.

బీజేపీ కేవలం తన మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే రూపొందించిన బడ్జెట్ అని ఆరోపించారు. బీహార్ కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్ కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు వచ్చాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఏర్పాటు తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్ లో మొదటిసారిగా, బడ్జెట్ లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం’ పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు. కానీ మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని మంత్రి ఖండించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించినప్పటికీ, తెలంగాణ పట్ట చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

TAGS