Prabhas : షారుక్ చేసిన తప్పే ప్రభాస్ చేయబోతున్నాడా..? ఆ హీరోయిన్ తో చేస్తే ప్రభాస్ కెరీర్ ఖతమే..!
Prabhas : పాన్ ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్న హీరో ప్రభాస్. ఆయన తర్వాతి సినిమా డ్రామా జానర్ లో రాబోతోంది. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోతున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ‘మామ్’ లో నటించిన పాకిస్తానీ నటి సజల్ అలీ నటించబోతోంది. ‘ఫౌజీ’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ విజువల్ గా, ఎమోషనల్ గా ఆకట్టుకునేలా ఉండబోతోందని, సోషల్ మీడియాలో బజ్ క్రియేటైంది.
ప్రభాస్ ఇటీవలి చిత్రాలతో వివాదాలు ఎదుర్కొంటున్నాడు. ఆదిపురుష్ చేసి రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించారని అందుకు ప్రభాస్ ఎలా ఒప్పుకున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. సలార్ సెల్ఫ్ బుకింగ్ వ్యూహాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కల్కి 2898 ఏడీలో కల్కి పాత్రను చిత్రీకరించినందుకు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది.
ఈ వివాదాల నేపథ్యంలో ఒక పాకిస్తానీ నటి సరసన నటించడం మరింత వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏ మేరకు ఉన్నాయో తెలిసి కూడా.. ఇలాంటి క్యాస్టింగ్ వల్ల బహిష్కరణలతో పాటు సినిమా చుట్టూ అనవసరమైన నెగిటివిటీకి క్రియేట్ అవుతుంది.
పాకిస్తానీ నటి మహీరా ఖాన్ సరసన గతంలో నటించిన షారూక్ ఖాన్ వివాదాలు, నిరసనలు, బహిష్కరించాలంటూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. షారూక్ రయీస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సజల్ అలీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి అయినప్పటికీ.. ఈ సమయంలో ఆమెను తీసుకోవడం సరైనది కాకపోవచ్చు. బాలీవుడ్ సినిమాలు అంటే కేవలం చిత్రీకరణ కాదు.. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు.
సజల్ అలీతో పాటు ఇంటర్నేషనల్ డ్యాన్సర్, మోడల్ ఇమాన్ ఇస్మాయిల్ కూడా హీరోయిన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు హను రాఘవపూడి ఆమెను ఇన్ లో ఫాలో అవడం మొదలు పెట్టి, ప్రభాస్, హనులను కూడా ఫాలో అవడం మొదలెట్టాడని సమాచారం.