Madhusudan Rao : మధుసూదనరావు గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇలా ఉండదు: వైఎస్ జగన్
Madhusudan Rao : మాజీ సీం వైఎస్ జగన్ ఓ పోలీసు అధికారిని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుపు కండువాలతో రాగా, లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్ అభ్యంతరం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడంపై మండిపడ్డారు. పేపర్లు గుంజుకొని చింపేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
పోలీసులపై వేలు చూపుతో హెచ్చరించారు. పోలీసు అధికారి మధుసూదనరావును ఉద్దేశిస్తూ ‘‘మధుసూదన రావు గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఇలాగే ఉండదు’’ అని హెచ్చరించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నీ టోపీపై ఉన్న సింహాలకు అర్థమేంట తెలుసా? అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.