Jagan : ఇప్పుడు కష్టమొచ్చిందని వేడుకుంటే ఎట్లా జగన్ సారూ!

Jagan

Jagan

Jagan : కారణం ఏదైనా 24వ తేదీ జగన్‌ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని అనుకుంటున్నారు. దానికి అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.

ఐదేళ్లలో పలు అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌ లోపలా, బయట అనేక పోరాటాలు చేస్తున్న సమయంలో జగన్‌ వద్ద 23 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఎవరికీ సంఘీభావం తెలపలేదు. కనీసం వాటివైపు కూడా తొంగిచూడలేదు. అవన్నీ మోడీ ప్రభుత్వంతో పోరాడుతుంటే, వైసీపీ ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వం అడగకపోయినా మద్దతిస్తుండేవారు. అందుకు ప్రతిగా ఆయనకు ఏ ప్రయోజనం చేకూరిందో అందరికీ తెలిసిందే.

ఇప్పటికీ జగన్‌ మోడీ ప్రభుత్వంతోనే కనెక్ట్ అయి ఉన్నారు. కనుక జగన్‌ ‘ఇప్పుడు నాకు కష్టం వచ్చింది.. అందరూ వచ్చి అండగా నిలవాలి అంటే వస్తారా?’ అంటే కాదనే అర్థం వస్తోంది. అయినా జగన్‌ ఇప్పుడు సీఎం కారు.. కనీసం ఆయన వద్ద పట్టుమని 10 మంది ఎంపీలు కూడా లేరు.

జగన్‌ ఏమీ ప్రతిపక్షాలను ఫైవ్ స్టార్ హోటల్ లో విందుకు రమ్మని ఆహ్వానించడం లేదు. ఆంధ్రాలో తన రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు, మైలేజీ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దానికి రమ్మనమని జగన్‌ ను ఆహ్వానిస్తే ప్రతిపక్ష పార్టీలు ఎందుకస్తాయి..? అసలు ఎందుకు రావాలి..? అని జగన్‌ ఆలోచించినట్లు లేదు.

తాను పిలవగానే అన్ని పార్టీలు తోకూపుకుంటూ వచ్చేస్తాయనే భ్రమలో ఉన్నారు మాజీ సీఎం. అందుకే ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నారు. కానీ అవి రాకపోతే నవ్వులపాలడం ఖాయమే కదా.

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయం వచ్చినప్పుడే జగన్‌ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. జగన్‌ మళ్లీ ప్రత్యేక హోదా అందుకున్నారు. కనుక రాష్ట్రపతి పాలన విధించాలని తన ఎంపీలతో అడిగించే బదులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిస్తే వారికైనా గౌరవం మిగులుతుంది కదా?

TAGS