Akkineni : ఫ్లాష్ బ్యాక్ : స్టార్ డైరెక్టర్ పై అక్కినేని రివేంజ్.. తప్పేంటో తెలిసేలా చేశాడు..

Akkineni

Akkineni

Akkineni :  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటుంటారు. ఓ స్టార్ డైరెక్టర్ నోటి దురుసుతనానికి తనదైన స్టైల్ లో రివేంజ్ తీర్చుకున్నారు  ఒకప్పటి  అగ్ర నటుడు ఏఎన్నార్. ఏఎన్ఆర్ తొలి సినిమా ధర్మపత్ని.. ఆ సినిమాకు దర్శకుడు పి పుల్లయ్య. నాటకాల నుంచి వచ్చిన అక్కినేనికి పద్యాలు వల్లె వేయడంలో దిట్ట.  షూటింగ్ టైమ్ లో ఖాళీ దొరికతే  దర్శకుు పి.పుల్లయ్య అక్కినేనిని పద్యం పాడమని ప్రేమగా అడిగేవారు. అంత పెద్ద డైరెక్టర్ అడిగేసరికి అక్కినేని కూడా కాదనకుండా పాడేవారు. సెట్లో, ఆఫీసుల్లో తరచూ ఇదే జరుగుతూ వచ్చింది. ఒకే పద్యం తరచూ పాడుతుండడంతో పుల్లయ్యకు విసుగెత్తి ‘ఎప్పుడూ ఇదే పాడ‌తావా అంటూ నోరు జారాడు. అనకూడని మాట అనేశాడు. దీంతో అక్కినేని ఎంతో నొచ్చుకున్నారు.  షూటింగ్ అయిపోగానే వెళ్లి ఏడ్చేశాడు. ‘ఇక సినిమాలొద్దు.. ఇంటికెళ్లిపోదాం’ అని అనుకున్నాడు. కానీ ఘంట‌సాల ర‌ఘురామ‌య్య సర్ది చెప్పడంతో అక్కినేని తన ఆలోచనను విరమించుకున్నాడు.

అనతి కాలంలోనే అక్కినేని సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు.  ఇక తన రివేంజ్ తీర్చుకునే రోజు వస్తుందని అక్కినేని కూడా ఆ రోజు ఊహించి ఉండరు. తనను తిట్టిన దర్శకుడు పి.పుల్లయ్య అక్కినేనితో సినిమా చేసేందుకు ఓ కథ రాసుకొని వచ్చాడు.  విషయం తెలుసుకున్న అక్కినేని కావాలనే రెండు గంట‌లు ఆల‌స్యంగా వ‌చ్చారు. ఆ త‌ర‌వాత దర్శకుడ చెప్పిన కథ విని అక్కినేని నచ్చిందని చెప్పారు.  అన్నయ్య పాత్రను ఎన్టీఆర్ తో చేయించాలని చెప్పాడు దర్శకుడు. ఇక  అక్కినేని తన రివేంజ్ తీర్చుకునేందుకు మెలిక పెడుతూ వచ్చాడు. అన్నయ్య పాత్ర నేను వేస్తానని చెప్పాడు. ఎన్టీఆర్ ను తమ్ముడి పాత్రలో జనం చూడరని బదులిచ్చాడు దర్శకుడు.  కానీ అక్కినేని మరొకరిన సూచించారు.

అన్న పాత్రకు జ‌గ్గయ్యను తీసుకోమని సలహా ఇచ్చాడు. అన్యమనస్కాంగానే పుల్లయ్య ఒప్పుకున్నారు. అయినా అక్కినేని తగ్గలేదు.. ఆలోచించుకోండి అంటూ పుల్లయ్యను మరింత కన్ఫ్యూజ్ చేశాడు. సినిమా తేడా కొడితే  మీరు  న‌న్ను బూతులు తిట్టినా తిడ‌తారు’ అని అక్కినేని అనడంతో పుల్లయ్యకు సీన్ అర్థమైంది.  ఆ విషయం ఇంకా గుర్తుందా.. ఏదో చనువు కొద్ది అలా అన్నానంతే అని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. విషయం మీకూ ఇంకా గుర్తుందంటే త‌ప్పు చేశాన‌ని మీరు ఒప్పుకున్నట్లే కదా అటూ తనదైన శైలిలో మరోసారి గుచ్చారు  అక్కినేని.  ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు అక్కినేని. వారి కలయికలో వచ్చిన సినిమానే అర్థాంగి. అక్కినేని సూచన మేరకు ఎన్టీఆర్ పాత్రలో జ‌గ్గయ్య చేశారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది.

TAGS