Madan Mohan : విజయసాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే.. శాంతి భర్త మదన్ మోహన్

Madan Mohan

Madan Mohan

Madan Mohan : ఇటీవల కాలంలో ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వల్లే తన భార్య శాంతికి కొడుకు పుట్టాడని ఆమె భర్త మదన్‌ మోహన్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తన భార్య శాంతి కూడా తనతో చెప్పిందని కూడా చెప్పాడు. కాకపోతే చట్టపరంగా బిడ్డకు తానే తండ్రినని పేర్కొన్నారు. అందుకే బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్టు చేసేందుకు అనుమతి కోరినట్లు తెలిపారు. బిడ్డ విషయమై వివాదం తీరాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్‌ డీఎన్‌ఏ టెస్టుకు రావాలని మదన్‌మోహన్‌ డిమాండ్‌ చేశారు. తాను విశాఖలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు కేసు షీట్‌లో పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరును చూసి షాక్ అయ్యానని చెప్పారు. అయితే ఆ చిన్నారితో తనకు ఎలాంటి సంబంధం లేదని సుభాష్ చెబుతున్నాడు. సుభాష్ తన బిడ్డకు తండ్రి అని శాంతి చెప్పింది.

 విజయవాడలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘నా భార్య శాంతికుమారి విశాఖపట్నంలో కొడుకుకు జన్మనిచ్చింది. ఆ టైంలో నేను అమెరికాలో ఉన్నాను. నేను వచ్చి ఆ ప్రెగ్నెన్సీకి కారణమేంటని ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని ఓసారి, ఆయన ద్వారా ఐవీఎఫ్‌ చేయించుకుని కొడుకుకు జన్మనిచ్చానని మరోసారి చెప్పింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శాంతి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్‌ పేరుంది. సుభాష్‌ను సంప్రదిస్తే.. శాంతికి, తనకు సంబంధం లేదన్నారు. 2016లో విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటలు అవాస్తవం. కావాలంటే నిజనిర్ధారణ పరీక్షలకు పంపించవచ్చు. మా ఇద్దరికి ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారు’ అని మదన్‌మోహన్‌ చెప్పుకొచ్చారు.

తనతో బలవంతంగా సంతకం చేపించి విడాకులు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆటలో తాను, శాంతి నలిగిపోతున్నాయని చెప్పాడు. ఈ వివాదం తర్వాత సుభాష్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు విజయసాయి రెడ్డి కారణమా? అని అడిగాడు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్టు చేయించాలని నిన్న హోంమంత్రి వంగలపూడి అనితా మదన్‌మోహన్‌ కోరారు. అన్ని వివరాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని మదన్ మోహన్ తెలిపారు.

TAGS