26th November Horoscope : నేటి రాశి ఫలాలు

26th November Horoscope

26th November Horoscope

26th November Horoscope : మేష రాశి వారికి ఉద్యోగస్తులకు బాగుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని విధాలా మేలు చేస్తుంది.

వ్రషభ రాశి వారికి చేపట్టే పనులు పూర్తిచేసుకుంటారు. ఆచితూచి మాట్లాడాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే మంచిది. ఈశ్వర ఆరాధన మంచి చేస్తుంది.

మిథున రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అధికారుల అండ ఉంటుంది. ఈశ్వరారాధన చేయడం వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి వారికి పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ముందుకు వెళ్లాలి. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

సింహ రాశి వారికి పనులు పూర్తి చేసుకుని ప్రశంసలు అందుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు దుర్గాధ్యానం చేయడం ఉత్తమం.

కన్య రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంతో పనిచేసి విజయాలు అందుకుంటారు. సూర్యనారాయణ మూర్తిని స్మరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

తుల రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఎవరిని అతిగా నమ్మకండి. శివధ్యానం చేయడం లాభదాయకం.

వ్రశ్చిక రాశి వారికి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాల వైపు అడుగులు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం బాగుంటుంది.

ధనస్సు రాశి వారికి అపార్థాలకు తలొగ్గొద్దు. మీ టాలెంట్ తో అందరిని ఆకట్టుకుంటారు. ఒత్తిడి పెరిగే అవకాశముంది. సూర్యుడిని ఆరాధించడం శ్రేయస్కరం.

మకర రాశి వారికి పనులు నెరవేర్చుకుంటారు. మొహమాటంతో ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. వ్యతిరేక ఫలితాలు ఉండొచ్చు. చంద్ర ధ్యానం చేయడం అన్నివిధాలా శుభకరం.

కుంభ రాశి వారికి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మాట పట్టింపులకు వెళ్లొద్దు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సహకరిస్తుంది.

మీన రాశి వారికి అప్రమత్తంగా ఉండి విజయాలు దక్కించుకుంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. పనులు పూర్తి చేసుకుంటారు సూర్యారాధన మంచి ఫలితాలు దక్కిస్తుంది.

TAGS