Windows : ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమానాలపైనా ప్రభావం

Windows : మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్ టాప్/పీసీ స్క్రీన్ లపై ఈ ఎర్రర్ కనిపించి.. వెంటనే సిస్టమ్ షటడౌన్ గానీ, రీస్టార్ట్ గానీ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.

మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటీయర్ ఎయిర్ లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో కొన్ని ఆన్ లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

TAGS