Vinukonda : పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య.. స్పందించిన జిల్లా ఎస్పీ

Vinukonda

Vinukonda

Vinukonda : పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ఎలాంటా రాజకీయ కోణం లేదని, వ్యక్తిగత కారణంగా హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగిందని, హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా, హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతిభద్రతలకు విఘాం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

కాగా, ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా షేక్ రషీద్ అనే యువకుడు ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా, హతుని మాజీ మిత్రుడు, పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్ పై విచక్షణాహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై కత్తితో కొట్టాడు. రషీద్ చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనను హత్యా రాజకీయం చేయాలని భావించిన విపక్ష వైసీపీ.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయంటూ ప్రచారానికి దిగింది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులు పెడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించారు.

TAGS