Anurag Kashyap : ఫ్లాప్ డైరెక్టర్ నుంచి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా.. అందంగా అనురాగ్ కశ్యప్ జర్నీ..
Anurag Kashyap : రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరిని ఏ దారిలో తీసుకెళ్తుందో చెప్పలేం. డైరెక్టర్ అవుదామని వచ్చిన వారు మంచి నటులుగా నందులను, జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. నటులుగా ఎదుగుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఫ్లాప్ లేదంటే భారీ సక్సెస్ డైరెక్టర్లుగా మారారు. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు అనురాగ్ కశ్యప్..
భారతీయ సినిమాల్లో కల్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు అనురాగ్ కశ్యప్. ఆయన దర్శకత్వంలో బ్లాక్ ఫ్రైడే, దేవ్ డీ, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, అగ్లీ, గులాల్ వంటి సినిమాలు వచ్చాయి. ఇవన్నీ సినీ అభిమానులు మూవీని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేశాయి.
కానీ, కొన్నేళ్లుగా ఆయన ఒక్కటంటే ఒక్క గుర్తుండిపోయే సినిమా కూడా డైరెక్ట్ చేయలేకపోయారు. ఘోస్ట్ స్టోరీస్, చోక్స్, దోబారా, దాదాపు ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమాలు పూర్తిగా డిజాస్టర్ గా మారాయి.
ఈ నేపథ్యంలో ఆయన సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాదిన ఇమైక్కా నొడిగళ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. లియో సినిమాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కాల్చి చంపే పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలను దక్కించుకున్నాడు.
రీసెంట్ గా రిలీజైన మహారాజాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. విజయ్ సేతుపతి మెరిసినప్పటికీ కశ్యప్ నటన కూడా వ్యూవర్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైంది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది దీన్ని తిలకించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో అతని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.
‘మహారాజా’లో సెల్వం పాత్రలో కనిపించిన కశ్యప్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మంచి పాత్రలు చేస్తూ తన క్రాఫ్ట్ ను మెరుగుపరుచుకుంటే కశ్యప్ నటుడిగా చిత్ర పరిశ్రమకు పెద్ద ఎస్సెట్ అవుతాడు. కల్ట్ డైరెక్టర్ నుంచి ఫ్లాప్ ఫిల్మ్ మేకర్ గా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా ఆయన ప్రయాణం విజయవంతంగా మారిందని చెప్పవచ్చు.