Hero Siddharth : హీరో సిద్దార్థ్ ఇంత మందితో ఎఫైర్ నడిపాడా..?
Hero Siddharth : సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు తమ తోటి హీరోయిన్లతో ఎఫైర్ నడపడం అనేది ఎప్పటి నుంచో కామన్ గానే వినిపిస్తున్న మాట. పైగా దానికి లవ్, డేటింగ్ అనే కొత్త పదాలు పెడుతున్నారు. ఇలా సౌత్ లో ఎక్కువ మంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన హీరో అంటే అందరికీ టక్కున సిద్దార్థ్ పేరే గుర్తుకు వస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదేమో.
ఆయన గతంలో సమంతతో డీప్ డేటింగ్ చేసి వదిలేశాడు. అనుకోని కారణాలతో ఈ ఇద్దరు విడిపోయారని అందరికీ తెలుసు. ఇక ఆమె తర్వాత అతను బాలీవుడ్ వెళ్లిపోయాడు. బాలీవుడ్ లో రంగ్ దే బసంతిలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో చేసిన సోహా అలీఖాన్ ను కూడా వదిలి పెట్టలేదు. ఆమె కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి వాడుకున్నాడనేది అప్పట్లో టాక్.
ఇక ఆమె తర్వాత మనోడు ఊరుకోలేదు. ఏకంగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తో లవ్ ఎఫైర్ స్టార్ట్ చేశాడు. శృతిహాసన్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన చరిత్ర మనోడికి బాగానే ఉంది. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ విడిపోయారు. ఆ తర్వాత మనోడు హీరోయిన్ దీప సన్నిధితో కూడా లవ్ ట్రాక్ నడిపి వదిలిపెట్టాడు.
ఇలా మనోడికి ఎంత మందితో డేటింగ్ చేసినా సరే బోరింగ్ గా అనిపించదేమో. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ అదితిరావు హైదరీతో డీప్ గా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి బాగానే తిరుగుతూ ముంబైలో కూడా కంట పడుతున్నారు. అప్పుడప్పుడు విదేశాలకు ట్రిప్ లకు వెళ్తున్నారనే టాక్ కూడా మీడియాలో వినిపిస్తోంది. మరి ఈమెను అయినా పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది.