AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
AP Cabinet : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో నాలుగు కీలక అంశాలను చర్చించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలుపాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి ఆమోదం తెలుపనుంది. పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల నుంచి లోన్లు తీసుకునే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరుగనుంది.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.