Shankar : శంకర్ కు మరో ‘సుజాత’ కావాల్సిందే..!

Shankar

Shankar

Director Shankar : శంకర్..ఈ పేరు చూస్తే చాలు ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్. ఇండియాలోనే శంకర్ లాగా సినిమాలు ఎవరూ చేయలేరనే టాక్ ఉండేది. ఆయన సినిమాలు చూస్తే..జంటిల్ మన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచతుడు, రోబో..ఇలా ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్. సామాజిక ఆంశాలతో ప్రేక్షకుడిని మెప్పించడంలో ఆయన దిట్ట.

వాస్తవానికి శంకర్ సినిమా అంటేనే భారీతనం ఉట్టిపడుతుంది. అద్దిరిపోయే పాటలు, భారీ సన్నివేశాలు, పేరుమోసిన తారాగణం, విదేశాల్లో షూటింగ్, విజువల్స్, కాస్ట్యూమ్స్, మాటలు, కామెడీ, ఎమోషన్స్, అద్భుతంగా పండే సీన్స్..ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల రసాలు శంకర్ సినిమాలో ఉంటాయి. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా చూసి బయటకు వస్తే..అందులోని పాత్రలు మనల్ని వెంటాడుతాయి. కథ, మాటలు ఆలోచింపజేస్తుంటాయి. ఆయన పాటలు, సంగీతం చెవుల్లో మార్మోగిపోతుంటుంది.

అలాంటి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ గత కొన్నేండ్లుగా సరైన హిట్ లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఐ, రోబో-2 సినిమాల తర్వాత వచ్చిన తాజా చిత్రం భారతీయుడు-2 కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అందరూ శంకర్ కు ఏమైంది? ఆయన సినిమాలు ఎందుకు ఆడడం లేదంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి శంకర్ కు గతంలో పనిచేసిన కథ రచయిత లేకపోవడమే ప్లాపులకు కారణమని అంటున్నారు.

జెంటిల్ మెన్ సినిమా దగ్గర నుంచి రోబో దాక శంకర్ దగ్గర ‘సుజాత రంగనాథన్’ అనే ఒక రైటర్ ఉండేవారు. ఆయన రాసిన కథ కూడా శంకర్ కి సరిగ్గా సెట్ అయ్యేది. అలాగే శంకర్ ఏం కోరుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా కథను అందించేవారు. కానీ రోబో తర్వాత సుజూత రంగనాథన్ చనిపోవడంతో శంకర్ కు భారీ దెబ్బ తగిలింది. ఆయన ఉన్నట్టైతే శంకర్ కు మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేవారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా వస్తున్న సినిమాల్లో శంకర్ మార్క్ మిస్ అవుతుందంటున్నారు.

ఇక ఇప్పుడు శంకర్ కు సుజాత రంగనాథన్ వంటి ఓ రైటర్ అర్జంట్ గా అవసరముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు అద్భుత కథలతో సదరు రైటర్ శంకర్ కు సహకారం అందిస్తే..మరిన్ని బ్లాక్ బస్టర్లు తీయడం ఖాయమంటున్నారు.

TAGS