Tamanna : ఆ హీరో ఒప్పుకుంటే పెండ్లి చేసుకుందామనుకున్నా.. తమన్నా హాట్ కామెంట్లు..!
Tamanna : తమన్నా అంటే నార్త్ నుంచి సౌత్ దాకా ఇప్పుడు గుర్తుపట్టని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె నార్త్ నుంచి సౌత్ వరకు కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ఆమె మొదట్లో నార్త్ లోనే సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఎందుకో ఆమెకు అక్కడ పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆమె సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంది.
ఆమె వరుణ్ సందేశ్ తో చేసిన హ్యాపీడేస్ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుని ముందుకు వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతూనే ఉండిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ. చిన్న హీరోల నుంచి మొదలు పెడితే స్టార్ హీరోల దాకా.. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల దాకా దాదాపు అందరినీ కవర్ చేస్తూనే ఉండిపోయింది.
ఇటు తెలుగులతో సీనియర్ హీరోలతో చేస్తూనే అటు కోలీవుడ్ హీరోలను కూడా కవర్ చేసేసింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులోని మాటలను బయట పెట్టేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో నేను ఓ హీరో మీద మనసు పారేసుకున్నాను. అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.
అతనితో కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో అతని వ్యక్తిత్వానికి పడిపోయాను. అతనితో కలిసి జీవితం పంచుకోవాలని ఆరాటపడ్డాను. పెళ్లి చేసుకుందామా అనిఅడిగాను. కానీ అతను అప్పటికే పెండ్లి అయినట్టు తెలిపాడు. దాంతో షాక్ అయ్యాను. నాకు ఆ విషయం తెలియదు. ఆ తర్వాత చాలా బాధపడ్డాను అంటూ సరదాగా చెప్పుకుంటూ వచ్చింది తమన్నా.