KTR : ఆయనకు స్ఫూర్తి చంద్రబాబే నట.. నామ జపం చేస్తున్న కేటీఆర్..!

KTR

KTR

KTR : బీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రస్తుతం చంద్రబాబు నామాన్ని జపం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే నెగెటివ్ గా కాదు.. పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఢిల్లీలో లేదంటే తెలంగాణలో మీడియాతో లేదా మరో సందర్భంలో ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా.. తాము మళ్లీ పుంజుకుంటామని చెప్పేందుకు చంద్రబాబు గెలుపే ఉదాహరణగా చూపుతున్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అన్నారని కానీ ఇప్పుడు ఆయన ఇటు ఏపీలో అటు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదుగుతుందని ఆయన చెబుతున్నారు.

ఢిల్లీలో ఎక్కడ చూసినా బాబు పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం చంద్రబాబు పని అయిపోయిందని అందరూ జాతీయ మీడియాతో చెప్పారు. జగన్ రెడ్డితో పాటు కేసీఆర్, కేటీఆర్ కూడా బాబు పని అయిపోయిందని అన్నారు. నడిమంత్రపు సిరి లాగా.. నడిమంత్రపు విజయం నెత్తికెక్కితే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు. ఇప్పుడు నిజం తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. బాబులాగే ఎదుగుతామని చెప్పేందుకు కేటీఆర్ ఉత్సాహపడుతూనే ఆయనను తప్పు పట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. అదే.. కేటీఆర్ రాజకీయం.

కేసీఆర్ కూడా తమ బలగంతో టీడీపీలాగా బలపడాలని చెబుతూ ఉంటారు. టీడీపీకి గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉందని.. దాన్ని ఆదర్శంగా తీసుకొని  ఎదగాలని సూచనలు చేస్తుంటారు. కానీ ఆయన అధికారం చేపట్టిన పది సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసుకోకుండా.. కేవలం వలస నేతలను పక్కన ఉంచుకొని తిరిగారు. ఓడిపోయిన తర్వాత టీడీపీ కాన్సెప్ట్ ను తెరపైకి తెస్తే ప్రయోజనం ఏముంటుంది? కానీ కేటీఆర్, కేసీఆర్ అదే పని చేస్తున్నారు.

TAGS