Karnataka : యువకుడిని చంపేశానని బాధపడ్డ ఈ కుక్క.. అతడి కోసం ఇంటికొచ్చి మౌనంగా రోదించింది

Karnataka

Karnataka, Stay Dog

Karnataka: మనుషులకన్నా జంతువులకే విశ్వాసం ఎక్కువ. నక్కకు తెలివి ఎక్కువ. కుక్కకు విశ్వాసం ఎక్కువ. ఇంత తిండి పెడితే కుక్క జీవితాంతం మన చెంతనే ఉంటుంది. మన ఇంటకి కాపలా ఉంటుంది. మన బంధువులు చనిపోతే కావాల్సిన వారు ఏడుస్తుంటారు. కానీ ఇక్కడ ఓ కుక్క తన వల్ల చనిపోయిన అతడి ఇంటికి వెళ్లి రోదించడం సంచలనం కలిగించింది. మనుషులకన్నా జంతువులే మేలు అనే వరకు వెళ్లింది.

హొన్నాళి క్యానికెరె గ్రామంలో తిప్పేశ్ (21) అనే యువకుడు కుక్క అడ్డం రావడంతో కిందపడి చనిపోయాడు. దీంతో అది చాలా బాధపడింది. నాలుగు రోజుల కింద జరిగిన సంఘటన గ్రామంలో సంచలనం రేపింది. తన ఊరి నుంచి అనవేరి గ్రామానికి వెళ్తున్న తిప్పేశ్ ద్విచక్రవాహనానికి అడ్డుగా శునకం రావడంతో దాన్ని తప్పించే క్రమంలో కిందపడి మరణించాడు.

తిప్పేశ్ తన వల్లే ప్రాణాలు కోల్పోయాడని భావించి అది అతడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది. మొదట వీధి కుక్కగా భావించి వెళ్లగొట్టారు. కానీ అది మళ్లీ మళ్లీ వస్తూ ఇల్లంతా తిరుగుతూ దుఖించింది. విపరీతమైన మూగ బాధను అనుభవించింది. తన వల్ల జరిగిన తప్పుకు పశ్చాత్తాపపడటం మనుషులకే కాదు జంతువుల్లో కూడా ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ.

కానీ ఇది అక్షరాలా నిజం. ఓ శునకం తన వల్ల జరిగిన మరణాన్ని తట్టుకోలేకపోయింది. కంటి నిండా కన్నీరు కార్చింది. తిప్పేశ్ తల్లి పక్కన కూర్చుని మౌనంగా ఏడ్చింది. ఈనేపథ్యంలో ఓ శునకం ఇంతటి బాధ వ్యక్తం చేయడం అందరిని కలచివేసింది. కుక్కలో ఉన్న విశ్వాసం మనుషుల్లో ఉంటే ఎంత బాగుండు అని పలువురు చర్చించుకోవడం కనిపించింది.

TAGS