Samantha : సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో దాని గురించి ఆలోచిస్తుందా?
Samantha : సమంత తన కెరీర్ పీక్స్ లో ఉండగా అనేక సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సమయంలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కానీ వారి వివాహ బంధం నాలుగేళ్లకే దూరమైపోయింది. ఆ తర్వాత మయాసైటిస్ అనే కండరాల వ్యాధితో సమంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది.
సమంత తన ఆరోగ్యం విషయంలో మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయింది. తర్వాత మెల్లిగా కోలుకొని తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయినా శాకుంతలం సినిమాలో నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.తద్వారా సమంత మళ్లీ సినిమాల్లో రాణించగలనని చాటి చెప్పింది.
సమంత ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు ఒప్పుకోకపోయినా మలయాళం లో స్టార్ హీరో మమ్ముట్టి తో ఒక సినిమా చేస్తుంది. దీంతో పాటు బాలీవుడ్ లో పాన్ ఇండియా వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు తోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాలే చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మొన్నటి వరకు తన ఆరోగ్యం పై దృష్టి పెట్టినటువంటి సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారిపోయింది.
అక్కినేని నాగచైతన్య తో పెళ్లి విడాకుల అనంతరం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత ప్రస్తుతం మెల్లిగా కోలుకుంటుంది. ఆత్మస్థైర్యంతో బతకగలను అని నిరూపిస్తోంది. తమిళ్ హీరో విజయ్ తో చివరి సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా మమ్ముట్టి హీరోగా గౌతమ్ వాసు దేవన్ తెరకెక్కిస్తున్న మూవీలో సమంత యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం సమంత సినిమాలపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సమంత ఒకప్పటి లా బిజీ బిజీ షెడ్యూల్ తో సినిమా షూటింగులతో హడావిడి చేయనుంది. ఇంతలా సమంత మారిపోవడానికి కారణం ఏమిటని విశ్లేషిస్తే ఆమె గుండె ధైర్యమే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇకపై మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.