Aadhaar : ‘ఆధార్’ లేకుంటే 10 రకాల పత్రాలు ఇవ్వొచ్చు.. ‘అమ్మకు వందనం’లో వెసులుబాటు

Aadhaar

AP

Aadhaar : ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంటక కిట్’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ లేకపోతే 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులు ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్ కిట్’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అమ్మకు వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. స్టూడెంట కిట్ కింది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు.

TAGS