Bigg Boss Amar : అమర్ కు ఫిట్స్.. బిగ్ బాస్ పర్యవేక్షణలో నటుడు.. ఈ వారం బయటకు రానున్నాడా ?
Bigg Boss Amar : బిగ్ బాస్ సీస్ 7 స్టార్ట్ అయ్యి రసవత్తరంగా సాగిపోతుంది.. గత సీజన్ కంటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సీజన్ ముందు నుండి ఆసక్తిగా సాగుతుంది.. ఇక ప్రస్తుతం ఈ సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుని 12 వ వారంలోకి అడుగు పెట్టింది.
మరి ఈ సీజన్ లో సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా పాల్గొన్న విషయం విదితమే.. ఇతడు స్టార్టింగ్ లో అంతగా ఆకట్టు కోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం కొద్దీ కోపం తగ్గించుకుని ఇతర హౌస్ మేట్స్ తో స్నేహంగా ఉంటున్నాడు.. తన పద్ధతిని మార్చుకుంటూ ఆడియెన్స్ లో క్రేజ్ పెంచుకుంటున్నాడు.. ఈ వారం కూడా పోలీస్ గా అదరగొడుతున్నాడు..
ఇదిలా ఉండగా తాజాగా హౌస్ లో అమర్ అస్వస్థతకు గురి అయ్యాడు అని ఇతడికి ఫిట్స్ రావడంతో ట్రీట్మెంట్ జరుగుతుందని టాక్ బయటకు వచ్చింది.. అంతేకాదు ఇతడు ఈ వారం బయటకు రాబోతున్నాడు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.. అయితే ఇతడి ఆరోగ్యం పై తాజాగా అమర్ సహ నటుడు నరేష్ లొల్ల స్పందించారు..
అమర్ కు ఆరోగ్య సమస్యలు ఉండడం నిజమే అని చెప్పుకొచ్చాడు.. నీతోనే డాన్స్ షో చేస్తున్న సమయం నుండే అమర్ కు ఈ ప్రాబ్లెమ్ స్టార్ట్ అయ్యిందని అప్పుడు విపరీతమైన స్ట్రెస్ వల్ల అమర్ కు కండరాల సమస్య వచ్చింది అని చెప్పాడు.. దీంతో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజమే అని అంత నమ్ముతున్నారు..