AP Assembly Meetings : ఆ రోజు నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ముహూర్తం ఫిక్స్.. బడ్జెట్‌పై సస్పెన్స్!

AP Assembly Meetings

AP Assembly Meetings

AP Assembly Meetings : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తంను ప్రభుత్వం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 22 వ తేదీ (సోమవారం)న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు సమావేశాలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా 3 నెలలపాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని సర్కార్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పడి నెల మాత్రమే అవుతుండడంతో.. వివిధ శాఖల్లోని ఆర్థిక వ్యవహారాల గురించి మంత్రులకు స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు బదులుగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆర్థిక శాఖ ఆలోచిస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని సర్కార్ యోచిస్తునట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా ఈ నెల మూడవ వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు.. వాటని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయి బడ్జెట్ మరో 3 నెలల తర్వాత ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ మంత్రి సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.

16వ తేదీ జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్‌పై మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 

TAGS