Google – ISRO : ఇక గూగుల్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు.. భారీ స్కెచ్ వేసిన ఇస్రో..

Google - ISRO

Google – ISRO

Google – ISRO : నేడు ప్రతీ మనిషి జీవితంలో ‘గూగుల్’ ఒక భాగంగా మారింది. ఏ సందేహం వచ్చినా.. ఎలాంటి సమాచారం కావాలన్ని గూగుల్ తల్లిని ఆశ్రయించకతప్పదు. సమస్త రంగాల్లో విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంది. అందుకే మనిషి జివితంలో భాగమైంది. గూగుల్ అమెరికా నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే, ఏదైనా సమస్యలు తలెత్తి గూగుల్ నిలిచిపోతే ప్రపంచం మొత్తం ఒక్క సారిగా స్తంభించి పోతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఇన్నోవేషన్ గూగుల్ కు సవాల్ విసురుతోంది. గూగుల్ కంటే మరింత మెరుగ్గా సమాచార వ్యాప్తిని, సామర్థ్యాన్ని అందించేందుకు ‘భువన్’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది.

ఇస్రో ఇటీవల ‘చంద్రయాన్ -3’ ప్రయోగం సక్సెస్ చేసి ప్రపంచ దేశాల చూపు తన వైపు తిప్పుకుంది. గతంలోనే ఇస్రో సామాజిక అవసరాల కోసం భువన్ ఏర్పాటు చేసింది. ఇది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంటే 10 రెట్లు అధికంగా సమాచారాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ, పట్టణాభివృద్ధి ప్రణాళిక, వ్యవసాయ విస్తరణ వంటి రంగాల్లో విలువైన సమాచారం అందిస్తుంది. భువన్ లో పంచాయత్, ఎన్డీఈఎం (నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్) అనే 2 కొత్త టూల్స్ అందుబాటులోకి తేనుంది. యూజర్ల కోసం మెరుగైన అనలటికల్ టూల్స్, డాటా సెట్లు సరఫరా ద్వారా స్థానిక పరిపాలన వ్యవస్థలకు తోడ్పాటు అందించేందుకు భువన్ పంచాయత్ టూల్ ఏర్పాటు చేసినట్టు ఇస్రో చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు జియో స్పెషియల్ డాటా ఉపయోగపడుతుందని ఇస్రో చెప్తోంది.

భువన్ ను పేరును సంస్కృత పదమైన ‘ఎర్త్’ నుంచి తీసుకున్నారు. ఇది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా భారత్ లోని భూ సామర్థ్యాలను పరిశీలించేందుకు తోడ్పడుతుంది. ఈ సాఫ్ట్ వేర్ ఉచితంగా లభిస్తుంది. యూజర్లకు 2D, 3D బహుళ సెన్సార్, ఉపగ్రహ చిత్రాలను యాక్సిస్ చేసేందుకు తోడ్పడుతుంది. ఎర్త్ బ్రౌజర్, ఇంటర్ ఆక్టివ్ గా పనిచేస్తుంది. వెక్టార్ లేయర్ గా అందించిన చిత్రాల నుంచి బ్యాక్ గ్రౌండ్ డేటాను ఎన్‌లార్జ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. భువన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ నుంచి వాస్తవ సమయానికి సంబంధించి వివరాలను పొందుపరుస్తోంది. దీంతో పాటు అటవీ ప్రాంతాల్లో జరిగే అగ్ని ప్రమాదాలు, కరువు కాటకాలు, కాలానుగుణంగా సంభవించే మార్పులను ముందుగానే తెలియజేస్తుంది.

TAGS