Raj Tarun – Ariyana Glory : అరియానా.. రాజ్ తరుణ్ మధ్య ఎఫైర్.. లావణ్య సంచలన ఆరోపణలు

Raj Tarun - Ariyana Glory

Raj Tarun – Ariyana Glory

Raj Tarun – Ariyana Glory : రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయిదే రాజ్ తరుణ్ తనను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని మీడియా ముందుకు వచ్చి తెలిపింది. హిరోయిన్ మాల్వీ మాల్వోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని పేర్కొంది. అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది.

అయితే వీరిద్దరి కథ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అందరికీ షాక్ కు గురి చేసింది. తాను మూడు నెలలు గోవాకు పై చదువుల కోసం వెళ్లినపుడు అరియానాతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది.

ఈ విషయం రాజ్ తరుణ్ మేనేజర్ తనకు తెలిపాడని చెప్పింది. లావణ్య ఆరోపణలను ఖండించారు. ఆమెకు మస్తాన్ అనే అబ్బాయితో సంబంధం ఉందని వారు రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పాడు. అంతే కాదు డబ్బుల కోసం ఫేమస్ కావాలనే ఇలా చేస్తోందని మండిపడ్డారు. అయితే దీనిపై లావణ్య మీడిమా ముందు మాట్లాడుతూ.. నాకు డబ్బులు అవసరం లేదని 14 ఏళ్లుగా కలిసి ఉన్నామని ఇప్పుడు నీ దారి చూసుకోమ్మంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాను డ్రగ్స్ తీసుకున్నానని అరెస్ట్ అయ్యాయని రాజ్ తరుణ్ ఆరోపించారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. కానీ ఆ రోజు పార్టీ జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నాను. అందుకే నన్ను అరెస్టు చేశారు. కానీ నేనేం తప్పు చేయలేనని తెలిసి విడిచిపెట్టారు. కానీ రాజ్ తరుణ్ ఆరోపించినట్లు తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని చెప్పింది. అయితే వీరిద్దరి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ కూడా ఆమె డేటింగ్ చేశాను అని చెప్పడం, కానీ ఇప్పుడు విడిపోయామనడం.. లేదు మోసం చేస్తున్నాడని లావణ్య కేసు వేయడం, అరియానా అంశం, డ్రగ్స్ విషయం ఇలా ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరి వీరి కథ ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.

TAGS