AP Government : నేడు మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

AP Government

AP Government

AP Government : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. పోలవరం, అమరావతిపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇప్పుడు ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు మూడో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నేడు ఇంధన శాఖలో నెలకొన్న ప్రస్తుతం పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకున్న చర్యల గురించి సర్కార్ వివరించనుంది. అలాగే 2019కి ముందు ఇంధన శాఖ పనితీరును వివరించనున్న ప్రభుత్వం.. మూడు గంటలకు సచివాలయంలో ఈ పత్రాన్ని విడుదల చేయనుంది.

శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా.. ఏపీలో విద్యుత్ శాఖ పనితీరు ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితేంటి? అప్పులెన్ని ఉన్నాయి? వంటి వివరాలు వెల్లడించబోతోంది. అలాగే 2019కి ముందు ఈ శాఖ ఎలా ఉండేదో తెలుపనుంది. తాము రాగానే కరెంటు ఛార్జీలను కంట్రోల్ చేస్తామని చంద్రబాబు అన్నారు. శ్వేతపత్రంలో పరిస్థితులను బట్టీ.. ధరలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే విద్యుత్ శాఖను మెరుగుపరిచేందుకు ఏం చేస్తారో, విద్యుత్ ఉత్తత్తిని పెంచేందుకు సోలార్, విండ్ ఎనర్జీని ఎలా తీసుకొస్తారో ఇవాళ చంద్రబాబు చెప్పే అవకాశాలు ఉన్నాయి. శ్వేతపత్రం విడుదల చేస్తూ.. వైసీపీని ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు శ్వేతపత్రాల ద్వారా.. వైసీపీ పాలన అత్యంత దారుణంగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇవాళ ఏం చెబుతుందో అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

TAGS