Zodiac Signs : ఈ నాలుగు రాశుల వారు రిలేషన్‌షిప్‌కి పనికిరారు.. పెద్ద అసమర్థులు!

Good Relationship

Zodiac Signs

Zodiac Signs : ఒక రిలేషన్ నమ్మకంగా పది కాలాల పాటు కొనసాగాలంటే పార్ట్నర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉండాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్ కూడా ముఖ్యమే.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రేమ వ్యక్తం చేసినా సరే.. ఈ నాలుగు రాశుల వారు రిలేషన్‌షిప్స్ ను అస్సలు మెయింటెన్ చేయలేరు. ఇందుకు నక్షత్రాల ప్రభావం ప్రధాన కారణం. ఏ రాశుల వారు సరిగా మేనేజ్ చేయలేరో తెలుసుకుందాం.

మిథునం..
ఈ రాశివారు నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. కానీ లైఫ్ పార్ట్నర్ తమ మాట విని, తమ నిర్ణయాలతో ఏకీభవించాలని కోరుకుంటారు. వీరు బాగా మాట్లాడతారు కాబట్టి సంబంధం గురించి మంచి అవగాహన ఉంటుంది. అయితే, ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటారు. తమ లైఫ్ పార్ట్నర్ తమకు సరైన వ్యక్తి అని భావించినా దూరంగా ఉంచుతారు. వారి ఆలోచనల ప్రకారం పనులు జరగనప్పుడు సానుభూతి తగ్గిస్తారు. దీంతో రిలేషన్‌షిప్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ రాశి వారు కొత్త సంబంధాలు సులువుగా పెట్టుకోగలరు. అయితే, పార్ట్‌నర్‌ను నిర్ధిష్ట సమయం వరకే పట్టించుకుంటారు. తర్వాత పట్టించుకోరు. కాబట్టి లాంగ్ టర్మ్ మెయింటెన్ చేయలేరు.

ధనుస్సు..
ఈ రాశి వారు లవ్, రిలేషన్‌షిప్స్‌ను సీరియస్‌గా తీసుకుంటారు. షార్ట్ టైములోనే రిలేషన్‌షిప్‌ను భరించలేనిదిగా ఫీల్ అవుతారు. ఉక్కిరిబిక్కిరి అవుతూ తెంచుకోవాలని భావిస్తారు. తమకు కావాల్సింది అంతా సాధించాలనుకుంటారు. ఈ రాశి వారు వృత్తిపరంగా బిజీగా ఉంటారు. పార్ట్నర్ తమ పర్సనల్ లైఫ్ లో వేలు పెడితే డిసప్పాయింట్ అవుతారు. వీరు స్వతంత్రాన్ని ఇష్టపడతారు. లవర్ తమపై ఎక్కువ ప్రేమ చూపిస్తే.. బంధంలో చిక్కుకున్నట్లు లేదంటే ఊపిరాడనట్లు ప్రవర్తిస్తారు.  

మేషం..
మేష రాశి వారు పార్ట్నర్ ను సంప్రదించకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. దీని వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. పార్ట్నర్ తమ మార్పులకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు. కోపంగా ఉన్న భర్త లేదంటే భార్యను వదిలేస్తారు. ప్రాబ్లం ఏంటని అస్సలు పట్టించుకోరు. దీనివల్ల పార్ట్నర్ ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించరు. వీళ్లు రొటీన్ సంబంధాలను ఇష్టపడరు. రిలేషన్‌షిప్స్‌ మేనేజ్ చేయలేకపోయినా బాధపడరు.

మీనం..
ఈ రాశి వారు ఇతరుల ఆలోచనలను చదువున్నామనట్లు నటిస్తారు. ఇదంతా తమకు తెలియకుండానే జరుగుతుంది. నిజానికి చాలా సందర్భాల్లో వీళ్లు చెప్పే విషయాన్ని తక్కువ అర్థం చేసుకుంటారు. అయినా ఇతరులను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అతి చేస్తారు. పార్ట్నర్ ప్రతీ కదలికను గమనిస్తారు. ఇలా ట్రాక్ చేయడం ద్వారా వారికి ఇబ్బంది కలిగిస్తారు. సంబంధాలను మేనేజ్ చేసే విషయానికి వస్తే వీళ్లు ఇమ్‌మెచ్యూర్‌గా ప్రవర్తిస్తారు. ఈ రాశి వ్యక్తులు ఎమోషనల్‌గా స్పందిస్తారు. జీవితాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఉత్తమ మార్గం ఇదేనని చూపించేందుకు ప్రయత్నిస్తారు

TAGS