Assam : మందలించారని టీచర్ ను హత్య చేసిన విద్యార్థి

Assam

Assam

Assam : మార్కులు తక్కువ వస్తున్నాయని మందలించిన టీచర్ నే హత్య చేశాడు ఓ విద్యార్థి. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. 11వ తరగతికి చెందిన ఓ విద్యార్థి కత్తితో తన కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు రాజేశ్ బారువాను పొడవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థికి తక్కువ మార్కులు రావడంతో రాజేశ్ అతన్ని మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురమ్మని ఇంటికి పంపాడు. కొంత సమయం తర్వాత ఆ విద్యార్థి మామూలు దుస్తుల్లో క్లాసుకు తిరిగివచ్చాడు. గమనించిన ఉపాధ్యాయుడు వెంటనే ఇంటికి వెళ్లిపొమ్మని ఆదేశించాడు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి, అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో రాజేశ్ ను పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై ఆయన నెలకొరిగి విలవిల్లాడాడు. తోటి విద్యార్థుల సమాచారంతో స్కూల్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించింది, కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

TAGS