Indian Army : ఇండియన్ ఆర్మీ కోసం లైట్ యుద్ధట్యాంక్.. పరీక్ష విజయవంతం

Indian Army

Indian Army

Indian Army : భారత ఆర్మీ కోసం డీఆర్డీఏ కొత్త యుద్ధ ట్యాంక్ ను తయారు చేసింది. జొరావర్ అని పిలిచే ఈ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంక్ ను శనివారం (జూలై 6) డీఆర్డీఏ విజయవంతంగా పరీక్షించింది. ఈ యుద్ధ ట్యాంకును డీఆర్డీవో, ఎల్ అండ్ టీ సంయుక్తంగా రూపొందించాయి. ఎత్తయిన పర్వతాలు, నదులను సమర్థవంతంగా దాటే కెపాసిటీతో ఈ యుద్ధట్యాంకును నిర్మించారు. ఈ యుద్ధట్యాంకులు హెవీ వెయిట్ ఉన్న టీ-72, టీ-90 యుద్ధట్యాంకుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది. జొరావర్ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకులు 2027లో ఇండియన్ ఆర్మీ చేతికి అందుతాయని డీఆర్డీవో చీఫ్ తెలిపారు.

లఢఖ్ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో వినియోగించేందుకు భారత ఆర్మీకి మరింత శక్తి సామర్థ్యాలను అందించేందుకు రూపొందించిన లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకు లైట్ వెయిట్ యుద్ధట్యాంకు జొరావర్. లడఖ్, పశ్చిమ టిబెట్ దండయాత్రకు నేతృత్వం వహించిన 19వ శతాబ్దపు డొగ్రా జోరావర్ సింగ్ పేరు మీదుగా దీనికి జోరావర్ అని పేరు పెట్టారు.

TAGS