Greater Vote : గ్రేటర్ ఓటు ఎటు వైపు? తాజా పరిస్థితి ఇదేనా!

Greater Vote

Greater Vote

Greater Vote : ఏ ఎన్నికలను తీసుకున్నా రాష్ట్రం మొత్తం ఒక తీరయితే.. గ్రేటర్ హైదరాబాద్ ఒక తీరు. ఎందుకంటే రాష్ట్రంలోని మొత్తం 119 సీట్లలో ఎక్కువగా 24 సీట్లు ఇక్కడే ఉంటాయి. ఇక ఓటర్ల సంఖ్య తీసుకుంటే కోటి మందికి ఇటూ అటుగా ఉంటారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ బలంగా ఉంది.. ఇక, ఎంఐఎం కూడా తన సీట్లను తాను గెలిచి పొత్తు పెట్టుకుంది. కానీ ఈ సారి సీన్ మరోలా కనిపిస్తుంది.

గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో తొమ్మిదింటిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కలుపుకొని చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. ఇక మిగిలిన 15లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు మూడింట ఒక వంతు మంది ఉన్నారు. అయితే, ఈ సారి వీరి ఓటు కీలకంగా మారుబోతున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో బీఆర్ఎస్, ఎంఐఎంలు 23 మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. ఒక స్థానం గోషామహల్ లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఈ సారి గోషా మహల్ తో పాటు మరిన్ని నియోజకవర్గాలను గెలుచుకునేందుకు బీజేపీ పోరాడుతుంది. ఈ సారి ఖాతా తెరిచి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ కుతూహలంగా ఉంది.

గతంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగగా గ్రేటర్ పరిధిలో 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తర్వాత జీహెచ్ఎంసీ 2016, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఎంఐఎం కూడా హైదరాబాద్ ఎంపీ పరిధిలోని ఏడు సీట్లలో ఆధిక్యం కొనసాగించింది. కానీ ఈసారి మాత్రం ఈ సమీకరణాలు చాలా వరకు మారేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా గ్రేటర్ పరిధిలోనూ బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టేలా కనిపిస్తుంది.

TAGS