MM Keeravani : అన్నదమ్ములే అయినా ఎందుకిలా ఎమ్ఎమ్ కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి అని పెట్టుకుంటారో తెలుసా..
MM Keeravani and SS Rajamouli : ఎమ్ ఎమ్ కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి, కేవీ. విజయేంద్ర ప్రసాద్ వీరంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు.. కానీ వీరి ఇంటి పేర్లు మాత్రం వేరే రకంగా ఎందుకున్నాయ్ అనుకుంటున్నారా.. ఇలా చాలా మంది డౌట్ పడుతూనే ఉంటున్నారు. అయితే ఇలా ఉండడానికి గల కారణాలను ఒక సారి తెలుసుకుందాం. అసలు వీరి ఇంటి పేరు కోడూరి. కోడూరి ఫ్యామిలీలో అయిదుగురు అన్నదమ్ములు ఉన్నారు. కోడూరి రామారావు, కోడూరి శివదత్తా కృష్ణ,
కోడూరి కాశీ, కోడూరి విజయేంద్ర ప్రసాద్, కోడూరి రామకృష్ణ అయితే కోడూరి శివ దత్తా కుమారుడే కీరవాణి. కీరవాణిని సంగీత దర్శకుడు చక్రవర్తికి పరిచయడం చేసింది. తన చిన తండ్రి కోడూరి కాశీ. కీరవాణికి సోదరుడు కల్యాణ్ మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా పని చేసిన అనుభవం ఉంది. కోడూరి విజయేంద్ర ప్రసాద్ కొడుకు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే ఎస్ ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అని అర్థం. ఆయన పూర్తి పేరు ఇది కాగా.. అందరికీ ఆయన ఎస్ ఎస్ రాజమౌళిగానే సుపరిచితులు.
కాగా కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి అని పెట్టారు. ఈయన్ని ఎమ్ఎమ్ కీరవాణి అని పిలవడం అలవాటైపోయింది. కీరవాణి బాహుబలికి సంగీత దర్శకత్వం వహించగా.. రాజమౌళి దర్శకత్వం వహించాడు. విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి తలో చేయి వేసి సినిమాను పెద్ద హిట్ గా మలిచారు.
విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు స్టోరీలు అందించడంలో దిట్ట. బాలీవుడ్ లో భజరంగీ బాయిజాన్ సినిమాకు కథను అందించాడు. ఎమ్ఎమ్ కీరవాణి చెల్లెలు శ్రీలేఖ కూడా సంగీత దర్శకురాలిగా, గాయనిగా ఫేమస్ అయింది. ఈమె అనేక సినిమాల్లో పాటలు పాడింది. ఆపరేషన్ దుర్యోదన లాంటి సినిమాకు మ్యూజిక్ అందించారు. కీరవాణి కొడుకు మత్తు వదలారా సినిమాలో హిరోగా నటించాడు. యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సింహా అనంతరం హిరోగా సినిమా చేశారు.