Food Market : దేశంలో ఫుడ్ మార్కెట్ దే హవా.. 2030 నాటికి ఎన్ని లక్షల కోట్లకు అంటే?

Food Market

Food Market

Food Market : భారత్ లో రాను రాను ఫుడ్ మార్కెట్ బిజినెస్ విస్తరించుకుంటూ పోతోంది. హోటళ్లే లేని దేశంలో నేడు హోటళ్లు మాత్రమే ఆకలిని తీర్చే స్థాయికి ఎదిగాయి. భారతీయ సంస్కృతిలో ఇంటి ముందటికి అతిథి వస్తే వారి కడుపు నింపి పంపేవారు. సరే అప్పుడున్న ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఇన్ని హోటళ్లు.. వాటిపై ఇంత బిజినెస్ మాత్రం జరిగేది కాదు. పెరుగుతున్న బిజినెస్ ను పరిశీలిస్తే రాను రాను ఇళ్లల్లో ఎవరూ వంట వండుకోరని మాత్రం విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫుడ్ బిజినెస్ నేడు అత్యంత ఆదరణ పొందిన వ్యాపారం. అయితే ఇది పెద్ద పెద్ద నగరాలకు బాగా కలిసి వచ్చే బిజినెస్. రాజధానులు, మెట్రోపాలిటిన్ సిటీల్లో పరుగుల జీవనం ఉంటుంది. రోజు మొదలవడం, ముగిసిపోవడం మన చేతుల్లో ఉండదు. ఈ బిజీ లైఫ్ లో కూరగాయాలు తెచ్చుకోవడం, వంట సరుకులు తెచ్చుకోవడం విలువైన సమయాన్ని వెచ్చించి వంట వండుకోవడం జరిగే పని కాదు. కాబట్టి ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు బయటి ఫుడ్ పై ఆధారపడాల్సిందే. స్విగ్గి, జొమాటో లాంటి యాప్ లు ఉంటే చాలు ఎక్కడికైనా.. ఎప్పుడైనా ఫుడ్ వస్తుంది. ఈ సంస్థలు నేడు పెద్ద ఎత్తున ఎదుగుతున్నాయి.

భారత్‌లో ఆహార సేవల మార్కెట్ ప్రస్తుతం ₹5.5 లక్షల కోట్లు ఉండగా, 2030కి అది ₹10 లక్షల కోట్లకు చేరొచ్చని స్విగ్గీ-బెయిన్ సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 32-34 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఆరేళ్లలో 43-45 కోట్లు చేరొచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వాటా 12 నుంచి 20 శాతానికి పెరగచ్చని అంచనా వేసింది. ఇప్పుడు 70 శాతం వాటా 50 నగరాల నుంచే వస్తుండగా.. రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి నమోదుకావొచ్చని పేర్కొంది

TAGS